»   » మహేష్, మురుగదాస్ చిత్రం లాంచింగ్ డేట్

మహేష్, మురుగదాస్ చిత్రం లాంచింగ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu


హైదరాబాద్ : ప్రస్తుతం బ్రహ్మోత్సవం షూటింగ్ లో బిజీగా ఉన్న దర్శకుడు మహేష్ తన తదుపరి చిత్రానికి రంగం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన తదుపరి చిత్రాన్ని దర్శకుడు మురగదాస్ తో చేయనున్నారు. ఈ మేరకు లాంచింగ్ కు ఏర్పాట్లు మొత్తం పూర్తయినట్లు సమాచారం. ఈ చిత్రం ఏప్రియల్ 12 , 2016న లాంచ్ చేయటానికి తేదీని ఖరారు చేసారు.

ఈ చిత్రానికి హీరోయిన్ ఎవరనేది ఫైనలైజ్ కాలేదు. శృతి హాసన్ హీరోయిన్ గా చేసే అవకాసం ఉందని వినికిడి. అలాగే మరో హీరోయిన్ గా అలియా భట్ ని కూడా అడుగుతున్నట్లు తెలుస్తోంది. చిత్రాన్ని తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తారు. ఎన్ వి ప్రసాద్, ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Mahesh

రీసెంట్ గా మహేష్ ..శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. కంటిన్యూగా ..శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఇప్పుడు బ్రహ్మోత్సవం చిత్రం చేస్తున్నాడు. జనవరికు ఆ చిత్రాన్ని పూర్తి చేసి సంక్రాంతి రేసులో ఉండే ప్లానింగ్ లో ఉన్నాడు. దాంతో మహేష్ సినిమాల మధ్య గ్యాప్ బాగా తగ్గిపోయింది.

మరో ప్రక్క బ్రహ్మోత్సవం అనంతరం కూడా ప్రాజెక్టులు వరస పెట్టి సైన్ చేసాసారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం, ఎ ఆర్ మురుగ దాస్ దర్శకత్వంలో మరో చిత్రం గ్రీన్ సిగ్న ల్ ఇచ్చారు. ఈ రెండు చిత్రాలు ఒకే సారి ప్రారంభమవుతాయి. వీటిన్నటి తర్వాత రాజమౌళి తో చేసే ప్రాజెక్టుని మెటీరియల్ చేసే అవకాసం ఉంది.

Brahmostavam

ఇప్పుడు చాలా మంది మిగతా హీరోలకు అర్దం కానీ విషయం..మహేష్ దగ్గరకు మంచి స్క్రిప్టులు ఎలా వెళ్తున్నాయి అనేది. అంతేకాకుండా హిట్ డైరక్టర్స్ అంతా మహేష్ చుట్టూ తిరుగుతున్నారు. నమ్రత,మహేష్ లు ఈ సీక్రెట్ ని విప్పి చెప్పాలి.

English summary
Mahesh Babu will be acting in Director Murugadoss is likely to be launched on 12th April 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu