బాలీవుడ్‌లో మహేష్-నమ్రత స్టూడియో?
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ లో మహేష్ బాబు-నమ్రత ఒకరు. ఇద్దరికీ సినీ నేపథ్యం ఉండటంతో వీరికి సంబంధించిన ఏ చిన్న విషయం అయినా టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఆ మధ్య ఇద్దరి మధ్య గొడవలు జరిగాయనే వార్తలు కూడా వినిపించాయి. అయితే గత కొన్ని రోజులుగా ఇద్దరూ కలిసి పలు సినిమా ఫంక్షన్లకు కలిసి హాజరవుతుండటంతో అవన్ని పుకార్లే అని తేలి పోయింది. తాజాగా ఈ జంటకు సంబంధించిన ఓ హాట్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. త్వరలో ఈ జంట బాలీవుడ్ లో ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించే యోచనలో ఉన్నారని, ఇందు కోసం ముంబైలో తమకు తెలిసిన వారి ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టారని ఫిల్మ్ నగర్ గుసగుస. బహుషా దీని ద్వారానే మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
తాజాగా మహేష్ బాబు నటించిన 'బిజినెస్ మేన్' సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర ఆడియోనే రెండు రోజుల క్రితం విడుదల చేశారు. పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలవుతోందీ సినిమా. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ మహేష్ బాబుతో రొమాన్స్ చేస్తోంది. తమన్ సంగీతం అందించిన బిజినెస్ మేన్ ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











