కంత్రి డైరక్టర్ తో కమిటయిన మహేష్ బాబు
మహేష్ బాబు ఏ సినిమా రిలీజ్ కాకుండా నష్టపోయిన మూడేళ్ళ కాలాన్ని పూడ్చుకోవాలనుకునే ప్లాన్ లో ఉన్నట్టున్నాడు. వరసగా సినిమాలకు సైన్ చేసేస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ తో కంత్రి చిత్రం తీసి..ప్రస్తుతం శక్తి ని తెరకెక్కిస్తున్న మెహర్ రమేష్ కథను ఓకే చేసినట్లు సమాచారం. తెలుగులో ఓ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే సంవత్సరం పిబ్రవరి నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. ఇది ఓ సెన్సేషనల్ ప్రాజెక్టు అవుతుందని అప్పుడే ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ తో మహేష్ చేస్తున్న ఖలేజా చిత్రం షూటింగ్ రెండు పాటలు మినహా పూర్తయింది. ఈ చిత్రం అనంతరం శ్రీనువైట్ల దర్శకత్వంలో దూకుడు చిత్రం చేయనున్నారు. అలాగే మెహర్ రమేష్ ..బాలకృష్ణతో కూడా ఓ చిత్రం కమిటయిన సంగతి తెలిసిందే.
More from Filmibeat
మహేష్ బాబు మెహర్ రమేష్ శక్తి ఖలేజా త్రివిక్రమ్ శ్రీనివాస్ కంత్రి khaleja mahesh babu shakti trivikram srinivas


Click it and Unblock the Notifications











