RRR తరువాత మహేష్ బాబుతో రామ్ చరణ్ సినిమా.. దర్శకుడు ఎవరంటే?
RRR సినిమా అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మార్పులు కనిపిస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే హీరోల మధ్య వాతావరణం కూడా చాలా మారింది. మొన్నటివరకు బయట ప్రపంచంలో ఒక స్టార్ హీరో మరొక హీరో పేరు ప్రస్తావించడానికే ఇష్టపడే వారు కాదని టాక్ నడిచింది. కానీ ప్రస్తుత కాలంలో హీరోల మధ్య పెరుగుతున్న స్నేహాన్ని చూస్తుంటే అభిమానుల్లో కూడా మార్పు వస్తుందని చెప్పవచ్చు.

RRR దెబ్బకు..
RRR సినిమా ఎప్పుడైతే ఎనౌన్స్ చేశారో మెగా నందమూరి అభిమానుల్లో ఒక కొత్త సంతోషం మొదలైంది. ఆ సినిమా దేబ్బకు అభిమానుల మధ్యన ఉన్న అడ్డుగోడలు బద్దలవుతున్నాయని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ తప్పకుండా ఈ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకోవడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని మరీంత పెంచుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

మహేష్ బాబుతో రామ్ చరణ్..
మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్ కూడా మంచి స్నేహితులని అందరికి తెలిసిన విషయమే. చాలా సందర్భాల్లో మహేష్ రామ్ చరణ్ కలిసి అభిమానులకు దర్శనమిచ్చారు. అప్పుడప్పుడు పార్టీల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. అయితే రామ్ చరణ్ మహేష్ బాబుతో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి.

మల్టీస్టారర్ కాదు..
RRR తరువాత రామ్ చరణ్, మహేష్ బాబు కలిసి ఒక సినిమా చేయనున్నారు అని వార్తలు రాగానే మరొక మల్టీస్టారర్ రానున్నట్లు కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే అది నిజం కాదట. మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించనుండగా రామ్ చరణ్ హీరోగా కనిపించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. సూపర్ స్టార్ చాలా కాలంగా G.మహేష్ బాబు ప్రొడక్షన్ హౌజ్ పేరుతో పలు సినిమాలకు సహా నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
Recommended Video

బిగ్ బడ్జెట్ మూవీ..
ఇప్పటివరకు సోలో నిర్మాతగా వ్యవహరించని మహేష్ బాబు మొదటిసారి రామ్ చరణ్ తేజ్ కోసం కోసం బిగ్ బడ్జెట్ సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నారట. ఇకపోతే ఆ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారట. అసలైతే ఆ దర్శకుడు మహేష్ 27వ సినిమాకు డైరెక్షన్ చేయాల్సింది. కానీ మహేష్ ఆ కథ తనకు సెట్టవ్వదని రామ్ చరణ్ కి కరెక్ట్ గా సెట్టవుతుందని అతనితోనే ఇద్దరం కలిసి ఆ సినిమా చేయాలని దర్శకుడికి సూచించినట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











