ఎందుకైనా మంచిదనే మహేష్ ముందు జాగ్రత్త?

By Srikanya

హైదరాబాద్ : పోలీస్ పాత్రలో 'ఆగడు' కనిపించిన తరవాత కాస్త రెస్ట్ తీసుకొన్నాడు మహేష్‌బాబు. ఇప్పుడు మళ్లీ షూటింగులతో బిజీ అవుతున్నారు.మహేష్‌ హీరోగా మై త్రీ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. 'మిర్చి' తరవాత ఆయన రూపొందిస్తున్న చిత్రమిదే. ఈ చిత్రం కుటుంబ అనుభంధాలను మిళితం చేసిన కథ అని తెలుస్తోంది. మిర్చి తరహాలో యాక్షన్ ని మిళితం చేస్తూ కుటుంబ అనుబంధాలకు ప్రయారిటీ ఇస్తూ కొరటాల శివ కథను రెడీ చేసారని తెలుస్తోంది. అలాగే పూర్తి కమర్షియల్ ఫార్మెట్ లో నడిచే కథ అని, ఏ మాత్రం రిస్క్ తీసుకోదలుచుకోలేదని అంటున్నారు. ముఖ్యంగా 1 నేనొక్కిడినే, ఆగడు ఫలితం మహేష్ ని పూర్తిగా నిరాశపరిచిందని అందుకే ఈ జాగ్రత్తలు అంటున్నారు.

శ్రుతి హాసన్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఈ నెల 30 నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తారు. నవంబరు 3 నుంచి మహేష్‌బాబు షూటింగ్‌లో పాల్గొంటారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహేష్‌బాబు శైలికి తగిన కథ ఇది. కుటుంబ బంధాలకూ చోటుంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించే బాణీలు ఆకట్టుకొంటాయని నిర్మాతలు చెప్తున్నారు.

Mahesh next is regular Mass Masala?

మహేష్ బాబు మాట్లాడుతూ....కొరటాల చెప్పిన కథ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉంది. మా కాంబినేషన్ లో ఇది మంచి కమర్సియల్ ఫిలిం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో ఈ సినిమా రూపొందుతోంది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''నా రెండో చిత్రమే మహేష్‌బాబుతో చేయబోతుండడం ఆనందంగా ఉంది. క్లాస్‌, మాస్‌ కలిపిన కథలో మహేష్‌ పాత్ర ఆకట్టుకొంటుంది. ఈ కథలో అన్ని రకాల వాణిజ్య హంగులూ ఉన్నాయి. మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు దొరికారు.ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. యువతరం, కుటుంబం తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. మహేష్ బాబు అభిమానులు మెచ్చే చిత్రం అవుతుంది ''అన్నారు.

నిర్మాలు మాట్లాడుతూ... మా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చెయ్యడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శ్త్తకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా జూలై నెలలో ప్రారంభం కానుంది. ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X