మహేష్‌కి ఆ రెండు కథలు నచ్చలేదా.. సుకుమార్‌కి మళ్లీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. మహేష్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వంశీపైడిపల్లి ఈ చిత్రానికి దర్శత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అద్భుతమైన సందేశాత్మక కథతో వంశి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నది. మహేష్ బాబు స్టూడెంట్ గా, కార్పొరేట్ సంస్థ అధినేతగా, రైతుల సమస్యలని పరిష్కరించే వ్యక్తిగా మూడు కోణాల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది. ఇదిలా ఉండగా మహేష్ తన తదుపరి చిత్రం సుకుమార్ తో చేయవలసి ఉంది.

రంగస్థలం తర్వాత

రంగస్థలం తర్వాత

రంగస్థలం చిత్రం ఘనవిజయం సాధించగానే సుకుమార్ మహేష్ బాబుకు ఓ స్టోరీ లైన్ వివరించారట. ఆసక్తికరంగా ఉండడంతో మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మైత్రి మూవీస్ నిర్మాణంలో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. కొన్ని రోజుల క్రితం సుకుమార్ కథ మొత్తం సిద్ధం చేసి మహేష్ కు వినిపించాడట ఇది పీరియాడిక్ డ్రామా కావడంతో మహేష్ బాబుకు ఎందుకో రిక్స్ అనిపించి ఈ కథ వద్దని.. మరో కథ సిద్ధం చేయమని తెలిపాడట.

మళ్లీ నిరాశే

మళ్లీ నిరాశే

సుకుమార్, మహేష్ కాంబినేషన్ లో ఇప్పటికే 1 నేనొక్కడినే అనే చిత్రం వచ్చింది. ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ పరాజయాన్ని దృష్టిలో ఉంచుకుని, మహేష్ ఇమేజ్ కు తగ్గట్లుగా సుకుమార్ మరో థ్రిల్లర్ కథని సిద్ధం చేశారు. కానీ ఈ కథ కూడా మహేష్ ని పూర్తి సంతృప్తి పరచలేదని సమాచారం. దీనితో సుకుమార్ తన వద్ద ఉన్న కథలలో మహేష్ కు సరిపోయే స్క్రిప్ట్ కు పదును పడుతున్నట్లు తెలుస్తోంది.

ఆలస్యం అవుతుందా

ఆలస్యం అవుతుందా

సుకుమార్ వీలైంత త్వరగా కథ సిద్ధం చేస్తే మహర్షి విడుదలకు ముందే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. లేకుంటే మరో దర్శకుడు లైన్లోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. మహేష్ తో సినిమా చేయడానికి దర్శకులు క్యూలో ఉన్నారు. సుకుమార్ రంగస్థలం చిత్రంతో దర్శకుడిగా కేరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. అలాంటి సుకుమార్, మహేష్ కాంబినేషన్ అంటే అంచనాలు అమాంతం పెరగడం ఖాయం.

ఏప్రిల్‌లో విడుదల

ఏప్రిల్‌లో విడుదల

ఇటీవలే మహర్షి చిత్ర యూనిట్ కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసింది. మహేష్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. భరత్ అనే నేను చిత్రంతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్న మహేష్.. వచ్చే ఏడాది మహర్షి చిత్రంతో అలరించబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X