మహేష్ బాబు- పూరి-చిరు ఖైదీ షురూ..?
చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా ఖైదీని...మహేష్ బాబు హీరోగా రీమేక్ చేయబోతున్నాను అంటూ ఇటీవల పూరి జగన్నాథ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్, నేను గత మూడేళ్లుగా ప్లాన్ చేస్తున్నాం అని కూడా వెల్లడించారు.
ప్రస్తుతం మహేష్-పూరి కాంబినేషన్ లో బిజినెస్ మ్యాన్ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఇంకా పూర్తి కానేలేదు..మరో సినిమాకు తెర వెనక సన్నాహాలు మొదలు పెట్టారు ఈ పోకిరి కాంబినేషన్. బిజినెస్ మ్యాన్ షూటింగ్ అయిన వెంటనే దీన్ని మొదలు పెట్టేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా....ఈ సినిమా చిరంజీవి ఖైదీ రీమేకే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగక్ నుంచి. అయితే పూరి మాత్రం ఈ విషయాన్ని నిర్దారించలేదు.
ఈ నేపథ్యంలో మహేష్ బాబు అభిమానుల్లో అయోమయం నెలకొంది. ఆ సినిమా ఖైదీ సినిమానా? కాదా? అనే విషయాన్ని కన్ ఫర్మ్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు.
అప్పట్లో వచ్చిన ఖైదీ సినిమాతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్న చిరంజీవికి అప్పటి నుంచి దిశ తిరిగి పోయింది. స్టార్లందరినీ వెనక్కి తోసి మెగాస్టార్ గా నెం.1 స్థానంలో తిష్టవేశాడు. ఆ సినిమా రీమేక్ లో నటిస్తే తాను కూడా టాలీవుడ్ నెం.1 పొజిషన్ లోకి వెళతానని సెంటిమెంటల్ గా ఆలోచిస్తున్నాడట మహేష్ బాబు.


Click it and Unblock the Notifications











