నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కు పండుగే
హైదరాబాద్ : ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. పూరి జగన్నాథ్, మహేష్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్టైన పోకిరి చిత్రం సీక్వెల్ సిద్దమవుతోందని ఆ వార్త సారాంశం. నవంబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుందని, ఇప్పటికే మహేష్...ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. స్టోరీ లైన్ విని ముచ్చడపడ్డ మహేష్ ..ఇమ్మిడియట్ గా డేట్స్ ఇవ్వటానికి ముందుకు వచ్చాడని అంటున్నారు. ఇది నిజమే అయితే మహేష్ అభిమానులకు ఆనందపరిచే వార్తే.

పోకిరి చిత్ర కథ మాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని రెడీ చేసారు . దానికి తోడు దర్శకుడు పూరి జగన్నాథ్ అందించిన సంభాషణలను సినిమాకు ప్రాణమై నిలిచాయి. ముఖ్యంగా " ఒక్కసారి కమిట్ అయితె నా మాట నేనే వినను" ఇంకా "నేను ఎంత ఎదవనో నాకే తెలీదు", "సినిమాలు సూత్తల్లెదెంటి " వంటి డైలాగులు జనాలు నోట్లో చాలా కాలం నానాయి.మహేష్ బాబు ,ప్రకాశ్ రాజ్ పోటాపోటిగా నటించారు. ఇలియాన ఈ చిత్రంలో హైలెట్ గా నిలిచింది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్.
ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బండ్ల గణేష్ ఓ సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ సినిమానే పోకిరికి సీక్వెల్‌గా చేస్తున్నారని, ఇందులో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడని చిత్ర వర్గాల సమాచారం. రభస పూర్తయిన తరువాత ఈ చిత్రం సెట్స్‌పైకి రానుందని తెలిసింది.


Click it and Unblock the Notifications











