twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సీతమ్మవాకిట్లో...’ కి మహేష్, వెంకటేష్ రెమ్యునేషన్స్

    By Srikanya
    |

    హైదరాబాద్: మహేష్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందిన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించినందకు గానూ మహేష్ కు రెమ్యునేషన్ గా... ఏడు కోట్లు ప్లస్, శాటిలైట్ రైట్స్ (అవో 7 కోట్లు) తీసుకున్నట్లు సమాచారం. అలాగే వెంకటేష్ కు ఆరు కోట్లు రెమ్యునేషన్ గా ఇచ్చినట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మహేష్ కు ఇచ్చిన రెమ్యునేషన్ ఎక్కువ అనిపించినా ఈ రోజు చిత్రం మహేష్ మూలంగానే పూర్తి స్దాయిలో కలెక్షన్స్ కురిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. వెంకటేష్ వల్ల ఫ్యామిలీ ప్రేక్షకులు కనెక్టు అవుతున్నారు.

    శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈచిత్రం..... అంతకంటే ముందు రిలీజైన బ్లాక్ బస్టర్ హిట్ 'నాయక్' చిత్రం పోటీని తట్టుకుంటూ మంచి వసూళ్లు సాధిస్తోంది. కొన్ని చోట్ల పాత రికార్డులను బద్దలు కొడుతూ...మరికొన్ని చోట్లు సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 1500లకు పైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విడుదలైన ప్రతి చోటా సూపర్ కలెక్షన్లతో దూసుకెలుతోంది.

    ముఖ్యంగా అమెరికా బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం తన విశ్వరూపం చూపింది. ఇప్పటి వరకు యూఎస్‌లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం మొదటి స్థానంలో ఉండేది. అయితే పాత రికార్డులన్నీ బద్దలు కొడుతూ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అమెరికాలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

    వీకెండ్ తో పాటు, సంక్రాంతి హాలిడేస్ కలిసి రావడం, అచ్చమైన తెలుగు సినిమా, మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్, హింస, బూతు లేని సినిమా అంటూ మంచి టాక్ రావడంతో ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాకు భారీ సంఖ్యలో హాజరవుతున్నాయి. అందులోనూ మహేష్ బాబు, వెంకటేష్ సినిమాలకు ఫ్యామిలీ ప్రేక్షకుల తాకిడి సాధారణంగానే అధికం. ఇలా అన్ని విధాలుగా అవకాశాలను అందిపుచ్చుకుంటోందీ చిత్రం.

    English summary
    Mahesh Babu took remuneration of Rs.7cr in cash plus Satellite rights as his remuneration for the film ‘SVSC’. Satellite rights may fetch another Rs7cr for him which comes around Rs14cr. Whereas Venkatesh took Rs.6cr as his remuneration for the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X