బాలయ్యకు మహేష్ బాబు అభ్యర్థన?
బాలయ్య నటించిన శ్రీరామ రాజ్యం సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఆస్టుస్టు 15నే ఆడియో రిలీజ్ చేశారు. దసరాకు సినిమా రిలీజ్ చేస్తారని భావించినా....దీపావళికి అంటూ వాయిదా వేశారు. అయితే సినిమా దీపావళికి కూడా విడుదల కావడం లేదు. డిసెంబర్ నెలలో సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే సినిమా ఎందుకు వాయిదా వేస్తున్నారు? అనే అంశం తెలియక అభిమానులు అయోమయంలో ఉన్నారు. సినిమాకు సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాలేదంటూ అభిమానులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు యూనిట్ సభ్యులు.
అయితే అసలు కారణం అది కాదని ఫిల్మ్ నగర్ టాక్. ఈ వాయిదా వెనక సూపర్ స్టార్ మహేష్ బాబు హస్తం ఉందట. మహేష్ బాబు, దూకుడు చిత్ర నిర్మాతల అభ్యర్థన మేరకే బాలయ్య, శ్రీరామ రాజ్యం సినిమాను వాయిదా వేసుకున్నారట. మగధీర రికార్డులను బద్దలు కొట్టడం కోసమే బాలయ్యను అభ్యర్థించారని సమాచారం. తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధిక సెంటర్లలో 50 రోజులు ఆడిన చిత్రంగా మగధీర రికార్డు ఉంది. దూకుడుతో దీన్ని అధిగమించాలని ప్లాన్ చేస్తున్నాడు మహేష్ బాబు. శ్రీరామ రాజ్యం విడుదలైతే కొన్ని థియేటర్ల సంఖ్య తగ్గిపోతుంది. రికార్డు దక్కదు. అదన్నమాట సంగతి.


Click it and Unblock the Notifications











