మహేష్ ‘ఆగడు’ ఇన్ సైడ్ టాక్
హైదరాబాద్ : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి నిర్మించిన సినిమా ‘ఆగడు'. మహేష్‌బాబు, తమన్నా జంటగా నటించారు. శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఈ మధ్య కాలంలో ఏ చిత్రానికి రాని క్రేజ్ వచ్చింది. మహేష్ పోలీస్ పాత్రలో కనిపించటం, శ్రీను వైట్ల కాంబినేషన్, ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ ఈ క్రేజ్ ని క్రియేట్ చేసాయి. ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే టాక్ అంతటా స్ప్రెడ్ అవుతోంది. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం ఇన్ సైడ్ టాక్ ఏంటి అనేది ఆసక్తికరమైన విషయం. కంటెంట్ పరంగా యావరేజ్ గా ఉన్నా..కమర్షియల్ ఎలిమెంట్స్ విషయంలో సూపర్ హిట్ లాగ ఉందని టాకచ్.
పరిశ్రమలోని కొందరు చెప్తున్నదాన్ని బట్టి...ఈ చిత్రం ఫస్టాఫ్ ఫుల్ కామెడీతో అదిరిపోయే పంచ్ లతో నడుస్తుంది. ఇంటర్వెల్ దగ్గరకి వచ్చేసరికి...అప్పటివరకూ పోలీస్ గా రెచ్చిపోయిన ఎనకౌంటర్ శంకర్..పోలీస్ కాదని ట్విస్ట్ ఇచ్చే ఓ షాకింగ్ ఇంటర్వెల్ పడుతుంది. దాంతో సెంకండాఫ్ పై అంచనాలు పెరిగిపోతాయి. అయితే సెకండాఫ్ లో కామెడీ ...ఫస్టాఫ్ తో పోలిస్తే తక్కువే, కానీ బ్రహ్మానందం మీద వచ్చే ఎపిసోడ్(రోప్ సాంగ్) మాత్రం సినిమాని మళ్లీ పైకి లేపి నిలబెడ్తుంది. ఓవరాల్ గా సినిమా ఒకటికి,నాలుగు సార్లు చూసేలా ఫన్ తో నింపేసారు శ్రీను వైట్ల.

అలాగే సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ హైలెట్ గా నిలుస్తుంది. దూకుడులో తండ్రి ఎంపిసోడ్ లాగ ఇది ప్రేక్షకుడుకి పడుతుంది. ఇక పాటలు,ఫైట్స్ చెప్పక్కర్లేదు. డైలాగ్స్ రెగ్యులర్ శ్రీను వైట్ల స్టైల్ లో ఉండి మహేష్ మాడ్యూలేషన్ లోంచి వస్తూంటే బుల్లెట్స్ వస్తున్నట్లు ఉంటాయంటున్నారు. సినిమా ఈ యేడాది బిగ్గస్ట్ హిట్ అవుతుందని లెక్కలు వేస్తున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ..మహేష్‌బాబు సి.ఐగా కనిపిస్తారు. బ్రహ్మానందం పాత్ర సెకండాఫ్‌లో ఎంటర్ అవుతుంది. రాజేంద్రప్రసాద్ పాత్ర ఎమోషనల్‌గా సాగుతుంది. కొన్ని బ్లాగ్స్ హిలేరియస్‌గా నవ్విస్తాయి. థమన్ తన 50వ సినిమా అని చాలా బాగా కష్టపడ్డాడు. సినిమా విడుదలైన తర్వాత పాటలు ఇంకా ఎక్కువగా రీచ్ అవుతాయి. రీరికార్డింగ్ ఎక్స్‌ట్రార్డినరీగా కుదిరింది. మహేష్ చేసిన డ్యాన్సుల్ని తెరపై చూసుకోవాల్సిందే. ఇది పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్. ఎక్కడా ట్విస్టులుండవు. అభిమానులకు పండగలా అనిపిస్తుంది


Click it and Unblock the Notifications











