'ఆగడు' :తన బర్తడేకి ఒకటి..తండ్రి బర్తడేకి మరొకటి
హైదరాబాద్ : అభిమానులకు తమ హీరోల జన్మదినం పెద్ద పండుగ క్రింద లెక్క. అది గమనించిన సినిమావాళ్లు ఆ రోజు ఆన్ లో ఉన్న తమ ప్రాజెక్టుల సంభందించిన ఏదో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తూంటారు. తాజాగా మహేష్ హీరోగా నటిస్తున్న 'ఆగడు' కోసం నిర్మాతలు అలాంటి ఏర్పాట్లే చేస్తున్నారు. మహేష్ తండ్రి గారైన సూపర్ స్టార్ కృష్ణ జన్మదినమైన ఈ నెల 31న 'ఆగడు' సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నారు . మహేష్ జన్మదినమైన ఆగస్టు 9న పాటలను విడుదల చేసేందుకుప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఇద్దరి పుట్టిన రోజులని గ్రాండ్ గా ప్లాన్ చేసారు.
ఇక 'పోకిరి','దూకుడు' సినిమాల్లో మహేష్ వినోదం, పోలీసుదర్పంతో ప్రేక్షకులు, అభిమానుల్ని అలరించారు. ఇప్పుడు మరోసారి ఇలాంటి వినోదం అందించడానికి 'ఆగడు' ద్వారా రాబోతున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా హీరోయిన్. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ లడఖ్‌లో జరుగుతోంది. హీరో,హీరోయిన్స్ పై పాటను చిత్రీకరిస్తున్నారు. దినేష్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్నారు.

''ఈ నెల 30 వరకు లడఖ్‌లో చిత్రీకరణ ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుపుతాం.'' అని నిర్మాతలు చెప్తున్నారు. 'దూకుడు' తర్వాత మహేష్, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి.
మహేష్ శైలి వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఈచిత్రంలో సోనూసూద్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, నెపోలియన్, సాయికుమార్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్, కళ: ఎ.ఎస్.ప్రకాశ్, కూర్పు: ఎం.ఆర్.వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి.


Click it and Unblock the Notifications











