మహేష్ ...దసరాబుల్లోడే అంటున్నారు
హైదరాబాద్ : పండుగ రోజుల్లో సినిమా రిలీజ్ చేస్తే కలెక్షన్స్ పై ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పండగ శెలవలను ఎంజాయ్ చేయటానికి, పండుగ మూడ్ తో జనం థియోటర్స్ కు వస్తారు. ఇదే స్ట్రాటజీతో మహేష్ బాబు తాజా చిత్రం 'ఆగడు' ని ముస్తాబు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా ఉత్సవాల ని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 26 న విడుదల చేయాలనే ఫిక్స్ అయినట్లు అంతర్గత వర్గాల సమాచారం. అలాగే ఆగస్టు 31న ఈ చిత్రం ఆడియోని గ్రాండ్ గా విడుదల చేస్తారని తెలుస్తోంది.
చిత్రంలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్,బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. 'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
'దూకుడు' తర్వాత మహేష్, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్ శైలి వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్, కళ: ఎ.ఎస్.ప్రకాశ్, కూర్పు: ఎం.ఆర్.వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి.


Click it and Unblock the Notifications











