మహేష్ 'బిజినెస్‌మ్యాన్' కథ కి బేస్ అదేనా?
మహేష్,పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ది బిజినెస్ మ్యాన్ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అప్పుడే ఈ చిత్రం కథపై రకరకాల గాలి వార్తలు మొదలయ్యాయి. ఈ చిత్రం గాలి జనార్ధన రెడ్డి జీవిత చరిత్రను బేస్ చేసుకుని పూరీ రూపొందించారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఇందులో మైనింగ్ కింగ్ వ్యవహారాలు సంభందించి కొన్ని అంశాలు కలిపి పూరి హాట్ గా మార్చబోతున్నాడని చెప్తున్నారు. అయితే హీరో కి ఆ పాత్రకి సంభంధం ఏమిటన్నది చెప్పటం లేదు. విలన్ కి చెందిన నెగిటివ్ షేడ్స్ లో ఈ మైనింగ్ కి చెందిన వ్యాపారాలు చూపెడతారని అంటున్నారు. అయితే ముంబై మాఫియాకి చెందిన కథగా ఈ సినిమాని కొందరు చెప్తున్నారు. ఇక 'బిజినెస్‌మ్యాన్'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన రూపొందించబోయే చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. రీసెంట్ గానే ఈ చిత్రం ఓపినింగ్ జరిగింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











