టాక్ ఆఫ్ ది టౌన్: విజయ్ సినిమా మహేశ్ చేతికి.. ఎన్టీఆర్ వల్లే ఇది సాధ్యమైందట.!
తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా దక్షిణాది మొత్తానికి తమ సినిమాలతో ప్రభావం చూపిస్తున్న హీరోల్లో విజయ్ దళపతి ఒకరు. కోలీవుడ్‌కు చెందిన హీరోనే అయినా.. అద్భుతమైన నటన, స్టైల్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్‌లలో మెప్పిస్తూ సౌత్ ఇండియన్ స్టార్‌గా వెలుగొందుతున్నాడు. గతంలో కంటే ఈ మధ్య విజయ్ సినిమాలన్నీ తెలుగులోనూ విడుదల అవుతున్నాయి. దీంతో టాలీవుడ్‌లోనూ అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ మధ్య విడుదలైన చిత్రాలన్నీంటికి ఇక్కడ మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన తర్వాతి సినిమా విషయంలో ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏంటా వార్త.? పూర్తి వివరాల్లోకి వెళితే...

‘బిగిల్'తో భారీ హిట్ కొట్టాడు
దళపతి విజయ్ ఇటీవల ‘బిగిల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. దాదాపు రూ. 300 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులను తిరగరాసింది. ఇందులో విజయ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో నయనతార హీరోయిన్.

తెలుగులో ఆయన రిలీజ్ చేశాడు
విజయ్ నటించిన ‘బిగిల్' తెలుగు డబ్బింగ్ హక్కులను ప్రముఖ నిర్మాత మహేశ్ కోనేరు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ ‘విజిల్' అనే పేరుతో విడుదల చేశారు. తెలుగులోనూ ఈ సినిమా మంచి టాక్ సంపాదించడంతో పాటు మహేశ్‌కు లాభాలను తెచ్చి పెట్టింది. ఈ ఉత్సాహంతో ఆయన మరిన్ని చిత్రాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

విజయ్‌ను కలిసిన మహేశ్
‘విజిల్' సూపర్ హిట్ అవడంతో మహేశ్ కోనేరు.. కొద్ది రోజుల క్రితం చెన్నై వెళ్లి మరీ హీరో ఇళయదళపతి విజయ్‌ను కలిశారు. ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘విజయ్ సార్‌ను కలిశాను. ‘విజిల్'ను తెలుగులో ప్రమోట్ చేసిన విధానం ఆయనకు బాగా నచ్చింది. ఈ విషయంలో నన్ను మెచ్చుకున్నారు' అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇద్దరూ మళ్లీ కలవబోతున్నారు
విజయ్ ప్రస్తుతం ‘ఖైదీ' ఫేం లోకేష్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ డిసెంబర్ 31న రివీల్ కానుంది. ఈ సినిమా తెలుగు రైట్స్ కూడా మహేశ్ చేతికి వచ్చాయట. ఇందుకోసం ఆయన రూ. 8.50 కోట్లు చెల్లించారని తాజాగా ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్ అవుతోంది. అంతేకాదు, దీనికి సంబంధించిన అడ్వాన్స్ కూడా చెల్లించారని టాక్.

ఎన్టీఆర్ వల్లే ఇది సాధ్యమైందట.!
విజయ్ కొత్త సినిమాకు సంబంధించిన తెలుగు రైట్స్‌ను మహేశ్ కోనేరు దక్కించుకోవడం వెనుక టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. దీనికి కారణం కొద్ది రోజుల క్రితం తారక్.. విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడడమేనని అంటున్నారు. వీళ్లిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్న విషయాన్ని కూడా మహేశ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌కు మహేశ్ సన్నిహితుడు. తారక్ నటించిన సినిమాలకు ఆయన పీఆర్వోగా పని చేశారు.


Click it and Unblock the Notifications











