నిజమా..పవన్ సినిమాలో మహేష్ గెస్ట్ రోల్ సీన్ ఇదేనా?
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది'(వర్కింగ్ టైటిల్) లో మహేష్ గెస్ట్ రోల్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అది రూమరా నిజమో తెలియదు కానీ...మహేష్ చేసే పాత్ర అంటూ మరో సీన్ ...ప్రచారంలోకి వచ్చింది.
ఆ సీన్ ఏమిటంటే..ఈ చిత్రంలో మహేష్ ఎన్నారైగా కనిపిస్తాడు. సమంతను పెళ్లి చూపులు చూసుకోవటానికి ఇండియా వస్తాడు. పవన్ కారు డ్రైవర్ కాబట్టి అతన్ని ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకుంటాడు. తర్వాత ఇద్దరూ చిన్న నాటి ప్రెండ్స్ మి అని గుర్తు చేసుకుంటారు. వారు చేసిన ఫైట్స్ గుర్తుకు వస్తాయి.
జల్సా లో టైటిల్ సాంగ్ బ్యాక్ డ్రాప్ లో ఇదంతా వస్తూంటుంది. ఇద్దరూ క్రిందకు దిగుతారు.. ఒకరి చేయి మరొకరు పట్టుకుని నడుస్తారు. ఆ తర్వాత సమంత,పవన్ మధ్య ఉన్న లవ్ స్టోరీ అర్దం చేసుకుని సాయిం చేస్తాడు. పవన్, మహేష్, సమంత మధ్య సాంగ్ కూడా ఉంటుంది.
అయితే ఇది వాస్తవమా..ఈ సీన్ ఉంటుందా అంటే ఖచ్చితంగా చెప్పలేము. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న న్యూస్ ఇది. అయితే ఇది నిజంగా ఉంటే కనుక థియోటర్ దద్దరిల్లి పోతుంది అనటంలో సందేహం మాత్రం లేదు. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. మే 3తో ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. ఆగస్టు 7వ తేదీన సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











