మహేష్ బాబు కొడుకు వాయిస్ కూడా...
హైదరాబాద్ : మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ... '1-నేనొక్కడినే' తో బాల నటుడుగా తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో గౌతమ్ డైలాగులకు మొదట వారే వారి చేత డబ్బింగ్ చెప్పిద్దామనుకున్నా...ఇప్పుడు ఆ పిల్లవాడు చేతే డబ్బింగ్ చెప్పిస్తున్నారని సమాచారం. అలా చేస్తే న్యాచురల్ గా ఉంటాయని భావించటం,మహేష్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిందని తెలుస్తోంది. ఇక తన మనవడు గౌతమ్ కృష్ణ తెరపై ఎంట్రీ ని చూడటానికి సూపర్ స్టార్ కృష్ణ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
మహేష్ బాబు,సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం '1-నేనొక్కడినే' . ఈ చిత్రం తదుపరి దశలోకి ప్రవేశించింది. డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. మొదట క్యారెక్టర్ ఆర్టిస్టులు, చిన్న చిన్న ఆర్టిస్టుల డబ్బింగ్ ఫినిష్ చేసి తర్వాత మహేష్ చేత డబ్బింగ్ చెప్పిస్తారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొత్త అనుభూతికి ప్రేక్షకుడిని గురి చెయ్యాలని దర్శకుడు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాలో చేజింగ్ సీక్వెన్స్ లు స్పెషల్ గా ఇప్పటివరకూ తెలుగు తెరపై రాని విధంగా తీస్తున్నారు.

మరో ప్రక్క రికార్డులన్నింటినీ మహేష్‌బాబు '1' 'నేనొక్కడినే' చిత్రం టీజర్ అధిగమించింది. శాటిలైట్ రైట్స్ పరంగా రికార్డ్ నెలకొల్పిందని, షాకిచ్చే రేంజిలో ఈ చిత్రం రైట్స్ అమ్ముడుపోయాయని సమాచారం. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని జెమినీ ఛానెల్ వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ ఏ తెలుగు చిత్రానికి రానంత రేటు..ఈ చిత్రానికి పలికినట్లు ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు. 1(నేనొక్కడినే) అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ రూ. 12.5 కోట్లకు అమ్ముడు పోయింది. మహేష్ బాబు సినిమాలకు ఫ్యామిలీల ఆదరణ బాగా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే టీవిలో మహేష్ సినిమాకు టీఆర్పీ రేటింగ్స్ ఓ రేంజిలో ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే మహేష్ సినిమా అంటే ఛానెల్స్ పోటీ పడతాయి. అందుకే ఈ స్థాయిలో శాటిలైట్ రైట్స్ వచ్చాయి.
సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.


Click it and Unblock the Notifications











