వాసుకి సుంకవల్లిని వద్దన్న మహేష్ బాబు భార్య?
బ్యూటీ కాంటెస్టుల్లో విజేతలుగా నిలిచిన చాలా మంది తారలు క్రమక్రమంగా తమ అడుగులు సినిమా రంగం వైపు వేడయం పరిపాటే. సుష్మితా సేన్, ఐశ్వ్యరాయ్, దియా మీర్జా, నిన్నటి తరం తార జుహి చావ్లా వీరంతా అందాల లోకం నుంచి సినిమాలోకంలోకి వచ్చినవారే... మన తెలుగు గడ్డపై నుంచి మిస్ ఇండియాగా నిలిచిన గద్దె సింధూర కూడా సినిమా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే ఆమెకు ఇప్పటి వరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు.
ఇటీవల మన రాష్ట్రం నుంచి మిస్ యూనివర్స్ పోటీల్లో టైటిల్ నెగ్గిన వాసుకి సుంకవల్లి కూడా సినిమాలపై కన్నేసింది. అయితే గద్దె సిందూరలా చిన్న హీరోలతో కాకుండా.....స్టార్ హీరో సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే తన భవిష్యత్ బాగుంటుందనేది ఆమె ఆలోచనట. మహేష్ బాబు సరసన ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ మహేష్ బాబు భార్య నమ్రత అందుకు సుముఖంగా లేదని ఫిల్మ్ నగర్లో పుకార్లు వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు బ్యూటీక్వీన్లతో నటించాలని కోరుకోవడం లేదని, ఇప్పటి వరకు తెలుగు ఆడియన్స్ ఏ బ్యూటీని ఆదరించలేదు అంటూ...ఈ ప్రతిపాదన మహేష్ బాబు వరకు రాక ముందే అటు నుంచి అటే పంపించేస్తుందట.


Click it and Unblock the Notifications











