twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    25 నుంచి మంగుళూరులో మహేష్ బాబు

    By Srikanya
    |

    హైదరాబాద్ :త్వరలో సముద్రతీర పట్టణం మంగుళూరులో '1'...'నేనొక్కడినే' సినిమాకు సంబంధించిన కీలక ఫైట్స్ చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నౌకాశయం, బీచ్‌లలో ఈ ఫైట్స్ ను తెరకెక్కించాలనే ఆలోచనలో చిత్ర దర్శకుడు సుకుమార్ ఉన్నారు. ఈ నెల 25 నుంచి మంగుళూరు షెడ్యూల్ ప్రారంభమవుతుందని చిత్ర వర్గాల సమాచారం. నవంబర్‌లోగా చిత్రీకరణను పూర్తిచేసి డిసెంబర్ రెండవవారంలో ఆడియోను ప్రేక్షకుల ముందుకుతీసుకురావడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

    మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం '1'...'నేనొక్కడినే' అనేది ఉపశీర్షిక. సుకుమార్ దర్శకుడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. కృతిసనన్ హీరోయిన్ .రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్‌స్టార్‌గా వినూత్న పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మహేష్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుందని, తొలిసారిగా ఆయన సిక్స్ ప్యాక్ దేహంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఇటీవలే బ్యాంకాక్‌లో కీలక ఘట్టాల షూటింగ్ ను పూర్తిచేసుకుంది.

    డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది.

    సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

    English summary
    Mahesh Babu has wrapped up ’1-Nenokkadine’ Bangkok schedule. Mahesh has been busy shooting action scenes for ’1-Nenokkadine’ in Bangkok for the about a month. Peter Heins supervised action scenes in Bangkok. After Bangkok schedule, ’1-Nenokkadine’ movie unit will move to Mangalore. ’1-Nenokkadine’ schedule will start from October 25th. The talkie part of ’1-Nenokkadine’ will be completed with this final schedule in Mangalore and Bangalore areas shoot. As soon as talkie part completes, dubbing will start. Mahesh Babu has been working hard for ’1-Nenokkadine’ . With ’1-Nenokkadine’ talkie part completing he will feel relaxed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X