ధనుష్ లాగే మహేష్ కూడా పాడుతున్నాడు
ఇప్పుడు ఎక్కడ విన్నా ధనుష్ కొలావర్ డి సాంగ్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రూటుని మహేష్ బాబు కూడా ఫాలో కానున్నాడు. బిజినెస్ మ్యాన్ చిత్రం కోసం ఆయన టైటిల్ సాంగ్ ని పాడనున్నారు.ఈ పాట సినిమాకు హైలెట్ గా నిలపాలని పూరీ ప్రయత్నిస్తున్నారు. ధనుష్ పాట లాగానే ఈ పాట కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంటే సినిమాకు బాగా ప్లస్ అవుతుందని ఆయన భావించి స్పెషల్ గా లిరిక్స్ రాయించి, ట్యూన్ చేయిస్తున్నట్లు సమాచారం. ఇక మహేష్ తొలిసారిగా ఇలా సినిమాల్లో పాట పాడటం జరుగుతోంది. ఈ చిత్రంలో ఎక్కువ భాగం ముంబైలో జరుగుతుంది. ముంబై మాఫిలో జరిగే వార్స్ నేపధ్యంలో ఈ కథ నడుస్తుందని చెప్తున్నారు. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతోంది.
తెలుగులో భారీ చిత్రాలు నిర్మిస్తున్న ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ఆడియోని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకాక్ లో పాటల చిత్రీకరణ జరుగుతుంది. అనంతరం హైదరాబాద్ లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె నాయుడు, సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications











