14 రీల్స్ బ్యానర్ లో మహేష్ మళ్లీ...పూర్తి డిటేల్స్

By Srikanya

హైదరాబాద్:14 రీల్స్ బ్యానర్ కు మహేష్ కు ఉన్న అనుబంధం తెలియంది కాదు. ఆగడు తో మొదలైన ఈ అనుబంధం తర్వాత 1,నేనొక్కడినే తర్వాత వచ్చిన ఆగడుతో కొనసాగింది. అయితే దూకుడు పెద్ద హిట్ అయితే ఆ తర్వాత వచ్చిన 1 నేనొక్కిడినే, ఆగడు చిత్రాలు రెండూ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యీయి. దాంతో నిర్మాతలు చాలా లాస్ అయ్యాయి. దాంతో మరోసారి వారికి డేట్స్ ఇవ్వటానికి మహేష్ ముందుకు వచ్చారని సమాచారం. ఈ సారి తనకు గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల తో మరోసారి పనిచేయటానికి ముందుకు వచ్చారు.

ఈ సారి ఆయన మల్టి స్టారర్ కాకుండా మహేష్ లోని మరో యాంగిల్ ని ఎలివేట్ చేస్తూ కథ రెడీ చేసారని తెలుస్తోంది. రీసెంట్ గానే మహేష్ ను కలిసి శ్రీకాంత్ అడ్డాల కథ వినిపించారని సమాచారం. కథ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ పూర్తి స్క్రిప్టు రెడీ చేసుకోమని చెప్పినట్లు సమాచారం. 2015 ఏప్రియల్ నుంచి చిత్రం ప్రారంభం కానుందని చెప్తున్నారు. ఈ మేరకు ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.

Mahesh-Srikanth film in 14 reels banner

ప్రస్తుతం మహేష్, కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. ఆ చిత్రం గురించి గురించి మహేష్ బాబు మాట్లాడుతూ....కొరటాల చెప్పిన కథ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉంది. మా కాంబినేషన్ లో ఇది మంచి కమర్సియల్ ఫిలిం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో ఈ సినిమా రూపొందుతోంది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''నా రెండో చిత్రమే మహేష్‌బాబుతో చేయబోతుండడం ఆనందంగా ఉంది. క్లాస్‌, మాస్‌ కలిపిన కథలో మహేష్‌ పాత్ర ఆకట్టుకొంటుంది. ఈ కథలో అన్ని రకాల వాణిజ్య హంగులూ ఉన్నాయి. మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు దొరికారు.ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. యువతరం, కుటుంబం తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. మహేష్ బాబు అభిమానులు మెచ్చే చిత్రం అవుతుంది ''అన్నారు.

నిర్మాలు మాట్లాడుతూ... మా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చెయ్యడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శ్త్తకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందనుంది. ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X