For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేష్-సుకుమార్ సినిమా ఇంట్రో సీన్ ఇదే

  By Srikanya
  |

  హైదరాబాద్ :మహేష్ బాబు,సుకుమార్ కాంబినేషన్ల్ ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ ఇంట్రడక్షన్ సీన్ అంటూ ఒకటి నెట్లో ప్రచారమవుతుంది. ఆ సీన్ ప్రకారం హీరో మహేష్ ..వర్షం బ్యాక్ గ్రౌండ్ లో మహేష్ మర్డర్ చేస్తూంటాడు. ఇంతకీ ఎవరిని మర్డర్ చేస్తూంటాడు...ఎందుకు మర్డర్ చేయాల్సిన అవరసం వచ్చింది అనేదే ఈ సినిమా అంటున్నారు.
  మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

  రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సంక్రాంతి నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా కథ విషయానికొస్తే... గోవా బ్యాక్‌ డ్రాప్‌తో ఈ చిథ్ర కథ నడుస్తుందని తెలిసింది. అంతే కాకుండా ఇందులో మహేష్ బాబు తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఇందులో లెక్చరర్ పాత్ర చేస్తున్నారని అంటున్నారు.

  ప్రస్తుతం మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. వెంకటేష్, మహేష్ బాబు, సమంత, అంజలి ప్రధాన పాత్రలుగా మల్టీ స్టారర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం గురించి దర్శకుడు అడ్డాల శ్రాంకాంత్ మాట్లాడుతూ...''పేరులోనే కాదు, సినిమాలోనూ తెలుగుదనం కనిపిస్తుంది. ఇద్దరు హీరోలను ఒకే తెరపై చూపించడం మంచి కథ ఉంటేనే సాధ్యం. అలాంటి కథ ఈ సినిమాలో ఉంది. కుటుంబ విలువలకు పెద్దపీట వేశాము''అని దర్శకుడు చెప్తున్నారు. ఇందులో ఒక్క పాత్ర కూడా వృథాగా ఉండదు. ఒక్క సీన్ వేస్ట్‌గా ఉండదు. అంత పగడ్బందీ స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందిస్తున్నాం అన్నారు.

  అలాగే ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. వెంకటేష్‌, మహేష్‌బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్‌ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అన్నారు. ఆస్తిపాస్తుల ముందు అన్నదమ్ముల బంధాలకు విలువ లేని కాలమిది. చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అనుకొంటూ ఎవరి బతుకులు వాళ్లు బతికేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో కూడా నాన్న దగ్గర చేసిన వాగ్ధానం కోసం ఆ అన్నదమ్ములు ఏం చేశారో తెర మీదే చూడాలంటున్నారు దిల్‌ రాజు. ఆయన నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'...అలాగే మల్టీస్టారర్‌ చిత్రాల్లో ఇదో ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని, అనుబంధాల విలువనీ హృద్యంగా చెప్పే ప్రయత్నమిది అన్నారు . వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా చేస్తున్నారు. సంగీతం: మిక్కీ జే.మేయర్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌.

  English summary
  Mahesh Babu and director Sukumar’s movie was started a few months ago. The movie’s regular shoot is progressing in a slow pace as mahesh Babu is busy participating the shoot of ‘Seethamma Vaakitlo Sirimalle Chettu’. As per the inside sources, it is learnt that mahesh-Sukumar’s combo movie is going to be a romantic and an action thriller. The introduction scene of the movie itself is very interesting. As per this, mahesh Babu murders a person in the night shade in a rainy background. However, we have to wait for the release of the movie to whom mahesh murders, and for what purpose he murders him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X