మహేష్ సొంతమా? బాలయ్య మరొకటి వెతుక్కోవాలా?
నందమూరి అగ్రహీరో బాలయ్య దూరంగా దగ్గరగా ఫేం రవి చావలి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు విషయం తెలిసిందే. బాలయ్య తొలిసారిగా హీరోయిన్ పార్వతి మెల్టన్ తో రొమాన్స్ చేస్తున్నాడు ఈ చిత్రంలో. పార్వతికి చాలా కాలం తర్వాత ఓ భారీ బడ్జెట్, పెద్ద హీరో సరసన లీడ్ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పకులు. ఈ చిత్రానికి 'కల్కి' అనే టైటిల్ ఖరారు చేసినట్లు గత రెండు మూడు రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఇందుకు భిన్నమైన వార్త వినిపిస్తోంది.
సుకుమార్-మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందబోయే చిత్రానికి 'కల్కి' అనే టైటిల్ ఖరారు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై దూకుడు నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తారని అంటున్నారు. ఇలా 'కల్కి' టైటిల్ ఇద్దరు టాప్ హీరోల సినిమాలపై వినిపిస్తుండటంతో ఏది నమ్మాలో తెలియక అభిమానులు అయోమయ పడుతున్నారు. మరి దీనిపై ఎవరో ఒకరు అధికారిక ప్రకటన చేస్తే తప్ప కన్ ఫ్యూజన్ తొలగే పరిస్థితి కనిపించడం లేదు. అయితే కొందరు మాత్రం 'కల్కి' టైటిల్ 14రీల్స్ బేనర్ పై రిజిస్టర్ అయిన ఉందని, బాలయ్య మరొక టైటిల్ వెతుక్కోవాల్సిందే అంటున్నారు.


Click it and Unblock the Notifications











