'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'టైటిల్ అసలైన అర్దం
వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ లో శ్రీకాంత్ అడ్డాల 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం టైటిల్ కు అర్దం గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. దాని ప్రకారం సీతమ్మ అంటే మహేష్ బామ్మ...సీతమ్మ వాకిలి అంటే వారు ఉంటే ఇంటి పేరు. అలాగే సిరిమల్లె చెట్టు అంటే ఉమ్మడి కుటుంబం అని చెప్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి మెలిసి ఉంటేనే చక్కగా చెట్టు పూలు పూసి ఆనందంగా ఉంటుంది...లేకపోతే విడిపోయి మోడువారిన చెట్టులా మారుతుందని అర్దంట.
అయితే దిల్ రాజు మాత్రం వేరే అర్దం చెప్తున్నారు. ఆయన టైటిల్ గురించి చెప్తూ.. సీతమ్మ వాకిలి.. అంటే భారతదేశం, సిరిమల్లె చెట్టు..అంటే కుటుంబం అన్నారు. ఆయన ఈ చిత్రంపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ''25 సంవత్సరాల తర్వాత వస్తున్న మల్టీస్టారర్ ఇది. వెంకీ, మహేష్ అన్నదమ్ము లుగా నటిస్తున్నారు. టైటిల్ మంచి ఫీల్‌నిచ్చింది. మే నెలాఖరుకి సినిమా పూర్తిచేసి..అదే నెలలో విడుదల చేస్తాం అన్నారు. ఇక ఈ చిత్రంలో లో ప్రకాష్ రాజ్ కీలకపాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వ్రకాష్ రాజు చేసే పాత్ర తండ్రి పాత్ర అని తెలుస్తోంది. పరుగులో చేసిన పాత్రనే ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో చేయనున్నారు. మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి సహనిర్మాతలు: శిరీష్- లక్ష్మణ్, కథ- కథనం-మాటలు-దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.


Click it and Unblock the Notifications











