పవన్ 'పులి' కి దారిచ్చి ప్రక్కకు తప్పుకుంటున్న మహేష్
మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రం ఆగస్టులో విడుదల చేయనున్నారని అభిమానులు సంబరపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సంబరాన్ని మహేష్ ఎంతోసేపు ఉండనిచ్చేటట్లు కనపడటం లేదు. తన చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయాలని ఆయన ప్లాన్ చేయమని పురమాయించినట్లు తెలుస్తోంది. దీనికి కారణం పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పులి అని తెలుస్తోంది. ఆ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ డేట్ పెట్టుకోవటంతో మహేష్ తన చిత్రానికి పోటీ ఎందుకని భావించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ నిర్ణయం మహేష్ కు వ్యక్తిగతంగా మంచి ప్రతిష్టను తీసుకొచ్చినా ఫ్యాన్స్ కు మాత్రం మరో సారి నిరాశకల్గించటమే అంటున్నారు. ఇక ఈ నిర్ణయం తీసుకోవటానికి పవన్ తో స్నేహం ఒక కారణం కాగా పవన్ తో జల్సా తీసి ప్రస్తుతం లవ్ ఆజ్ కల్ చిత్రం రీమేక్ కు డైలాగులు రాస్తున్న త్రివిక్రమ్ ఓ కారణం అంటున్నారు. అలాగే ఇంతుకు ముందు జల్సా సినిమాకు కూడా మహేష్ ..వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇవన్నీ ఓ ఎత్తు అయితే మహేష్, పవన్ రెండూ చిత్రాలకు ఒకే నిర్మాత సింగనమల రమేష్ కావటంతో...తన చిత్రాలే ఒకదానికి కొకటి పోటీపడటం ఆయనకూ ఇష్టం లేదంటున్నారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











