అభిమానులకు మహేష్, త్రివిక్రమ్ ‘సోప్’?
సూపర్ స్టార్ హహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలిసి ప్రేక్షకులకు సోప్ వేయడానికి సిద్దం అవుతున్నారు. గత సంవత్సరం వివిధ కార్పొరేట్ బ్రాండ్లకు అంబాసిడర్ గా పని చేసిన మహేష్ బాబు ఈ సంవత్సరం కూడా తన హవా కొనసాగించనున్నాడు. ఇప్పటికే మల్లీ బ్రాండ్స్ కు ప్రచారం చేస్తున్న ఈ సూపర్ స్టార్ ఖాతాలో మరో బ్రాండ్ వచ్చి చేరనుంది. ప్రముఖ సబ్బు కంపెనీ 'సంతూర్' మహేష్ బాబుతో ప్రచారం చేయించి తమ ఉత్పత్తులను పెంచుకునే ప్రయత్నంలో ఉందట. ఈ మేరకు త్వరలోనే ఓ యాడ్ ఫిల్మ్ రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాడ్ స్క్రిప్టు, దర్శకత్వం బాధ్యతలు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేపట్టున్నట్లు సమాచారం.
గతంలో త్రివిక్రమ్ పలు కార్పొరేట్ యాడ్లకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ బాబును ఈ యాడ్ లో స్టయిలిష్ గా చూపిస్తారనే నమ్మకంతో ఈ బాధ్యతలు అతనికి అప్పగించే యోచనలో సంతూర్ కంపెనీ ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











