అవన్నీ చూసి మహేష్ బాబు ఆందోళన?

By Srikanya

హైదరాబాద్ : మహేష్‌ బాబు - శ్రీనువైట్ల కలయిక మరోసారి 'ఆగడు' సినిమాతో పునరావృతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పోలీసు పాత్రతో మరోసారి ప్రతాపం చూపించబోతున్నారు మహేష్‌బాబు. అయితే ఈ చిత్రం దూకుడు లాంటి ప్రాజెక్టు అవుతుందని, అదే టీమ్ లో చేస్తున్న చిత్రం కదా అని మహేష్ బాబు చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారట. అయితే మెదట కోన వెంకట్, గోపీ మోహన్ ఈ ప్రాజెక్టు లో లేకపోవటం, తర్వాత ప్రకాష్ రాజ్ సైతం ప్రాజెక్టు కు బై చెప్పటం మహేష్ బాబుని ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పుకుంటున్నారు.

దీన్ని నిర్దారిస్తున్నట్లుగా.. సెట్ మీదే శ్రీను వైట్ల స్క్రిప్టు లో మార్పులు చేస్తున్నాడని బయిట టాక్ నడుస్తోంది. మరో ప్రక్క ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన 1 , నేనొక్కడినే చిత్రం డిజాస్టర్ కావటం కూడా ఆయన్ను ఈ ప్రాజెక్టుపై ఎక్కువ కాన్సర్టేట్ చేసేలా చేస్తోంది. అయితే యూనిట్ ఇవన్నీ అర్దం లేని ఆరోపణలు అని కొట్టిపారేస్తోంది. అద్బుతమైన స్క్రిప్టుతో సినిమా రెడీ అవుతోందని అంటున్నారు.

Mahesh unhappy with Srinu Vytla?

ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. 'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

'దూకుడు'తో మహేష్‌బాబుని పరర్ ఫుల్ పోలీసుగా చూపించిన శ్రీనువైట్ల ఇప్పుడు మరోసారి మహేష్‌తో ఖాకీ కట్టించారు. వీరిద్దరి కలయికలో 'ఆగడు' రూపుదిద్దుకుంటోంది. దాంతో ఈ చిత్రంపై ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అవుతోంది. దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X