మొట్టమెదటిసారిగా ఓ హీరోయిన్ పై మనసు పడ్డ మహేష్ బాబు..!?
ఎప్పుడూ మహేష్ మీద హీరోయిన్లు మోజుపడ్డమేగానీ..ఫలానా హీరోయిన్ కావాలని మహేష్ ఎప్పుడూ ఏ దర్శకుడిపైనా, ఏ నిర్మాతపైనా ఒత్తిడి తెచ్చిన దాఖలాల్లేవు. అయితే తొలిసారి మహేష్ ఓ హీరోయిన్ పై మనసుపడ్డాడట. ఆమె ఎవరో కాదు, 'వేదం", 'మిరపకాయ్", 'వాంటెడ్" చిత్రాలతో టాలీవుడ్ లో హాటెస్ట్ హీరోయిన్ అనిపించుకున్న దీక్షా సేథ్. పాపం, సక్సెస్ లు దక్కకపోయినా, అమ్మడి హాట్ సెక్సప్పీల్ కి మాత్రం ప్రేక్షకుల్లో మంచి డిమాండే వుంది.
ఈ డిమాండ్ సంగతెలా వున్నా, దీక్షా సేథ్ క్యూట్ ఫేస్ కి మహేష్ ప్లాటయిపోయాడట. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మహేష్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో దీక్షా సేథ్ హీరోయిన్ గా బుక్కయ్యిందనీ, అదీ మహేష్ కోరిక మేరకేననీ టాలీవుడ్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మహేష్ సోదరి మంజు నిర్మించునుండగా, 'దూకుడు" రిలీజయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
mahesh babu deeksha seth ravi teja mirapakaya dookudu మహేష్ బాబు దీక్షాసేత్ రవితేజ మిరపకాయ్ మంజుల దూకుడు


Click it and Unblock the Notifications