త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మహేష్ బాబు సీరియస్ వార్నింగ్
మహేష్ ప్రస్తుతం చేస్తున్న 'కలేజా' చిత్రం షూటింగ్ పూనేలో జరుగుతున్న సమయంలో త్రివిక్రమ్ మరో స్క్రిప్టు వినిపించాడని సమాచారం. దాంతో సీరియస్ అయిన మహేష్..మూడేళ్ళవరకూ తను బిజీగా ఉన్నానని, డేట్స్ అడగవద్దని, తర్వాత చూద్దామని చెప్పారని తెలుస్తోంది. అలాగే అనుకున్న టైమ్ కి ఆగస్టులో ఎట్టి పరిస్ధితుల్లో రిలీజ్ కావాలని వార్నింగ్ తరహాలో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక సురేంద్ర రెడ్డితో చేసిన అతిధి చిత్రం వచ్చిన రెండున్నర ఏళ్ళు కావటం, త్రివిక్రమ్ చేస్తున్న చిత్రం బాగా లేటు కావటం, బడ్జెట్ కూడా లిమిట్స్ దాటటం గమనించిన మహేష్ చాలా సీరియస్ గా ఉన్నాడని చెప్తున్నారు. దాంతో మరో సారి త్రివిక్రమ్ తో కమిట్ అయితే ఎప్పటికి అది పూర్తవుతుందో అన్న ఆలోచనతోనే రిజెక్టు చేసాడని చెప్తున్నారు. ఈ చిత్రం తర్వాత వరసగా శ్రీను వైట్లతో పవర్, లింగు స్వామి దర్శకత్వంలో ఓ చిత్రం, రాజమౌళి ఆ తర్వాత చేయాలని నిర్ణయించుకున్నారు.


Click it and Unblock the Notifications











