మహేష్ బాబుకు ప్రామిస్ చేసిన ప్రకాష్ రాజ్....
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి వివాహానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. కాగా ముంబాయ్ లో జరిగిన ఈ పెళ్ళికి మహేష్ బాబు వెళ్ళాలనుకున్నాడు. కానీ షూటింగ్ కారణంగా వెళ్ళలేకపోయాడు. అయితే మహేష్ బాబుకి ప్రత్యేకంగా హైదరాబాద్ లో పార్టీ ఇస్తానని ప్రకాష్ రాజ్ ప్రామిస్ చేసాడు. ప్రస్తుతం ఆ పార్టీ కోసం వెయిట్ చేస్తున్నానని మహేష్ బాబు అంటున్నాడు. ప్రకాష్ రాజ్ కు పోనీవర్మకు వివాహ సందర్భంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు అందజేశాడు. తెలుగులో ప్రకాష్ రాజ్, మహేష్ బాబు లు కలిసి చేసిన సినిమాలు అన్నీ(పోకిరి, అతడు, రాజకుమారుడు, అర్జున్) సూపర్ హిట్ అవ్వడం గమనార్హం.
More from Filmibeat
మహేష్ బాబు ప్రకాష్ రాజ్ పోనీ వర్మ పోకిరి అతడు రాజకుమారుడు అర్జున్ mahesh babu prakash raj pony varma pokiri athadu rajakumarudu arjun


Click it and Unblock the Notifications











