మహేష్ బాబు మూవీకి రూ. 6 కోట్ల అడ్వాన్స్ అందుకున్న సుకుమార్!
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం రూ. 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ వారు నిర్మించిన ఈ చిత్రం ఈ బేనర్‌తో పాటు అటు రామ్ చరణ్, ఇటు సుకుమార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. తమకు ఇంత పెద్ద హిట్ అందించిన దర్శకుడు సుకుమార్ తర్వాతి ప్రాజెక్టు కూడా మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మించబోతున్నారు. మహేష్ బాబు హీరోగా ఈ సినిమా తెరకెక్కబోతోంది.
ఇది మహేష్ బాబు కెరీర్లో 26వ చిత్రం. ప్రస్తుతం మహేష్ బాబు తన 25వ చిత్రం వంశీ పైడిపల్లితో చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత సుకుమార్ చిత్రం మొదలు కాబోతోంది. ఈలోగా సుకుమార్ స్క్రిప్టు వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయనున్నారు.

ఈ సినిమా కోసం సుకుమార్‌కు మైత్రి నిర్మాతలు రూ. 6 కోట్లు అడ్వాన్స్ పేమెంట్ చేశారట. 'రంగస్థలం' విజయంతో హాలిడే ఎంజాయ్ చేస్తున్న సుకుమార్.... తిరిగి వచ్చిన వెంటనే మహేష్ బాబు మూవీ స్క్రిప్టు వర్క్‌లో బిజీ కాబోతున్నారు.
ఈ సినిమా ఎలా ఉండబోతోంది? అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లూ బయటకు రాలేదు. అయితే ఇది ప్రయోగాత్మక చిత్రం మాత్రం కాదని, పూర్తి కమర్షియల్ మూవీ అని ఇటీవల మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











