వైస్ జగన్ బయోపిక్‌గా యాత్ర 2.. యువ నేత పాత్రలో నాగార్జున!

టాలీవుడ్‌లో అభిరుచి ఉన్న యువ దర్శకుల్లో మహీ వీ రాఘవ ఒకరు. ఇప్పటి వరకు ఆయన తీసిన చిత్రాలు ఆయన ప్రతిభకు అద్దం పట్టాయి. తన కెరీర్‌లో నాలుగో చిత్రాన్ని మరో సంచలన కథగా రూపొందించనున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల ఎపీ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలతో యాత్రను తెరక్కించిన ఆయన ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్ కథతో యాత్ర 2ను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఆ చిత్రంలో హీరో నాగార్జున నటిస్తున్నారనే వార్త మరింత సంచలన రేపుతున్నది. ప్రస్తుతం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త గురించి మరిన్ని విషయాలు..

 డైరెక్టర్‌గా హ్యాట్రిక్ విజయాలతో

డైరెక్టర్‌గా హ్యాట్రిక్ విజయాలతో

ఎన్నారై అయిన మహీ వీ రాఘవ సినిమాపై మక్కువతో పాఠశాల అనే ఓ భావోద్వేగమైన కథతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత సస్పెన్స్, థ్రిల్లర్ లాంటి కథతో ఆనందో బ్రహ్మను రూపొందించారు. మూడో చిత్రంగా వైఎస్ఆర్ జీవిత కథతో యాత్రను రూపొందించి హ్యాట్రిక్ సాధించారు. యాత్ర తర్వాత చాలా గ్యాప్ తీసుకొన్న మహీ ఇప్పుడు యాత్ర 2ను రూపొందిస్తున్నట్టు సమాచారం.

వైఎస్ జగన్ బయోపిక్‌గా యాత్ర 2

వైఎస్ జగన్ బయోపిక్‌గా యాత్ర 2

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన వైస్ జగన్మోహన్ రెడ్డి తనదైన మార్కుతో రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తున్నారు. తన తండ్రి మరణాంతరం వైఎస్ జగన్ జీవితంలో సంచలన విషయాలు చోటుచేసుకొన్నాయి. అలాంటి కీలక సంఘటనల ఆధారంగా యాత్ర 2 కథను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

యాత్ర 2లో కథ ఇలా ఉంటుందని

యాత్ర 2లో కథ ఇలా ఉంటుందని

వైఎస్ఆర్ కుటుంబాన్ని అమితంగా ప్రేమించి మహీ రాఘవ కొద్ది నెలల క్రితం వైఎస్ జగన్‌ను కలిసి తన ప్లాన్ చెప్పగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని, దాంతో లాక్‌డౌన్‌లో కథను సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. కథలో కీలక సంఘటనలతో ప్రారంభమై ఏపీ సీఎంగా వైఎస్ జగన్ అయ్యేంత వరకు కథ సాగుతుందనే వార్త ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

Recommended Video

RRR Makers To Finalize This Title ?
వైస్ జగన్‌గా నాగార్జున

వైస్ జగన్‌గా నాగార్జున

ఇక వైస్ జగన్‌గా టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున నటించబోతున్నారనే వార్త ఈ ప్రాజెక్టును క్రేజీగా మార్చింది. వైఎస్ జగన్‌తో నాగ్‌కు కూడా మంచి అనుబంధం ఉంది. అయితే ఈ సినిమా గురించిన వార్తపై అధికారికంగా ప్రకటన రాకపోవడంతో వాస్తవమేనా అనే సందేహం కలుగుతున్నది. ఇదిలా ఉండగా, నాగార్జున ప్రస్తుతం బిగ్‌బాస్‌ తెలుగు 4తో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X