యాత్ర సీక్వెల్ కోసం రంగం సిద్ధం చేస్తున్న దర్శకుడు.. వైఎస్ జగన్ పాత్రలో ఎవరంటే?
మమ్ముట్టి టైటిల్ రోల్ లో మహి వి రాఘవ దర్శకత్వంలో యాత్ర మూవీ తెరకెక్కి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తీసిన ఈ మూవీ ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది. సినిమాలో ఎమోషనల్ జర్నీ ప్రతి ఒక్కరికి చేరువ అయ్యింది. దీంతో మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడిగా మహి వి రాఘవకి ఈ మూవీ మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
ఇదిలా ఉంటే మహి వి రాఘవ తాజాగా సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మహి వి రాఘవ ఇంటర్వ్యూలో యాత్ర 2 గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. యాత్ర 2 ప్రాజెక్ట్ కచ్చితంగా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు.

అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అనేది క్లారిటీ ఇవ్వలేనని, కాని చేయడం మాత్రం ఖాయం అని చెప్పారు. అలాగే యాత్ర 2లో రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ ప్రయాణం చూపించబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. జగన్ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం, సొంతగా పార్టీ పెట్టడం, తరువాత యాత్ర చేసి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం వంటి కీలక ఘట్టాలు ఉంటాయంట.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ యాత్ర 2 మూవీలో జగన్ పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై హాట్ టాపిక్ నడుస్తోంది. గతంలో ఆర్జీవీ సినిమాలో జగన్ పాత్రలో రంగం ఫేమ్ అజ్మల్ నటించారు. అతనితోనే ఉంటుందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు ఈ పాత్రకి హిందీలో స్కామ్ 1992లో మెయిన్ లీడ్ చేసిన ప్రతీక్ గాంధీని కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందంట.
ప్రతీక్ గాంధీకి జగన్ కి దగ్గర పోలికలు ఉండటంతో అతను అయితే పెర్ఫెక్ట్ అని భావించి. గతంలో తమిళ్ హీరో జీవా పేరు కూడా తెరపైకి వచ్చింది. అలాగే విశాల్ కూడా జగన్ తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అతను కూడా యాత్ర 2 కోసం ఆసక్తి చూపిస్తున్నాడు అనే ప్రచారం నడిచింది. అయితే ప్రతీక్ గాంధీ చాలా వరకు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











