బాక్సాఫీస్ దద్దరిల్లేలా కొట్టిన డైరెక్టర్... లైన్లో విజయ్ దేవరకొండ కూడా?
'మజిలీ' సినిమా తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ డైరెక్టర్ శివ నిర్వాణ పేరు మారుమ్రోగిపోతోంది. 'నిన్నకోరి' సినిమాతో దర్శకుడిగా తెరంగ్రేటం చేసిన ఈ యంగ్ డైరెక్టర్ తన రెండో చిత్రంతో బాక్సాఫీస్ దద్దరిల్లే హిట్టు కొట్టాడు. ఏప్రిల్ 5న విడుదలైన 'మజిలీ' 2019లో 2వ బ్లాక్ బస్టర్ మూవీగా రికార్డుల కెక్కింది.
2019 సంవత్సరం మొదలై ఇప్పటికీ మూడు నెలలు గడిచిపోయింది. టాలీవుడ్ చిత్ర సీమకు అతిపెద్ద సినిమా సీజన్ అయిన సంక్రాంతి వరుస ప్లాపులతో షాకివ్వగా కేవలం 'ఎఫ్ 2' మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. మళ్లీ మూడు నెలల తర్వాత 'మజిలీ' రూపంలో టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ విజయం పడింది.

శివ నిర్వాణకు భారీ డిమాండ్
‘మజిలీ' విజయంతో శివ నిర్వాణ డిమాండ్ ఉన్న దర్శకుడిగా మారిపోయాడు. పలువురు నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అంతే కాదు యంగ్ హీరోలు కూడా శివ చెప్పే కథలు వినడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారట.

క్రేజీ హీరోకు కథ చెప్పాడు
తాజాగా సమాచారం ప్రకారం... టాలీవుడ్లో తక్కువ కాలంలోనే క్రేజీ స్టార్‌గా మారిపోయిన విజయ్ దేవరకొండకు ఇటీవలే శివ నిర్వాణ ఒక కథ చెప్పారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు సమాచారం.

ఓకే అయితే టేకప్ చేసేది వారేనంట
అన్ని అనుకున్నట్లు జరిగితే, శివ నిర్వాణ చెప్పిన కథ చేయడానికి విజయ్ దేవరకొండ ముందుకు వస్తే ఈ ప్రాజెక్టును ‘మజిలీ' నిర్మించిన షైన్ స్క్రీన్స్ వారు టేకప్ చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస కమిట్మెంట్లతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అవుతుందా? లేదా? అనే విషయంలో సందేహాలు నెలకొని ఉన్నాయి.

విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో ‘డియర్ కామ్రేడ్' అనే చిత్రం చేస్తున్నారు. ఈ మూవీని మే 31న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా విజయ్ ఇప్పటికే కమిట్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











