భారీ బడ్జెట్ తో డార్లింగ్ సినిమా ..
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు . రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే ఈ సినిమాలో డార్లింగ్ తో రొమాన్స్ చేయనుంది. రాధేశ్యామ్ షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమా తర్వాత మహానటిఫేమ్ నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం . ఇదిలా ఉంటే ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడి తో 'ఆదిపురుష్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .
దశాబ్దాల క్రితం నాటి కథతో దర్శకుడు ఓం రౌత్ ఈ కథను తెరకెక్కించేందుకు సిద్దమయ్యాడు. ఇక ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపించనున్నాడు. ప్రతినాయకుడిగా అంటే లంకేశ్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.'తానాజీ' సినిమాతో తానేంటో నిరూపించుకున్న ఓం రౌత్.. 'ఆదిపురుష్' ని నెక్స్ట్ లెవెల్ లో ఆవిష్కరించనున్నాడట.

ఈ మూవీకి విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువగా ఉండటం వల్ల భారతీయ చిత్రాలలో ఇంతకు ముందెన్నడూ చూడని టెక్నిక్ ని తీసుకురాబోతున్నారట. ఇందుకోసం సినిమాకు రూ. 350 - రూ.400 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఏక కాలంలో తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమా తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications











