Prabhas స్పిరిట్‌లో ప్రభాస్‌కు విలన్‌గా సూపర్ స్టార్.. సందీప్ రెడ్డి వంగా మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే కల్కి 2898 AD ని ఫినిష్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు రాజా సాబ్ తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత స్పిరిట్ ను పట్టాలెక్కించనున్నాడు. అర్జున్ రెడ్డితో టాలీవుడ్ తలరాతను మార్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా తరువాత అనిమల్ సినిమాతో బాలీవుడ్ సైతాన్ని షేక్ చేసిన ఈ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్పిరిట్.

ఇప్పటివరకు ప్రభాస్ ను క్లాస్ చూసాం.. మాస్ చూసాం. స్పిరిట్ తో ఊర మాస్ ను చూడబోతున్నాం. ఆ కటౌట్ కు పవర్ ఫుల్ పోలీస్ డ్రెస్ వేస్తే ఎలా ఉంటుందో అభిమానుల ఊహకే వదిలేయాలి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా పట్టాలెక్కుతుందా.. ? అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అనిమల్ తరువాత సందీప్ అనిమల్ పార్క్ మీద దృష్టి పెడతాడేమో అనికున్నారు. కానీ, వంగా మాత్రం స్పిరిట్ పైనే ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే రణబీర్ పలు సినిమాల్తో బిజీగా ఉన్నాడు.

makers have approached Bollywood hero Akshay Kumar for the film Spirit

ఇటుపక్క ప్రభాస్ రాజా సాబ్ అయ్యాక.. సలార్ 2 ను పట్టాలెక్కిస్తాడని అనుకున్నారు కానీ, అది ఇప్పుడప్పుడే అవ్వదని తేలిపోయింది. ఈ డిసెంబర్‌లో మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు గతంలో సందీప్ ప్రకటించడంతో హమ్మయ్య.. ఎట్టకేలకు సెట్స్ మీదకు వెళ్తుంది అని ఊపిరి పీల్చుకున్నారు. ఇక స్పిరిట్ కోసం వంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

అంతేకాకుండా సినిమా కోసం స్టార్ క్యాస్టింగ్ ను తీసుకొనే పనిలో ఉన్నాడట. పాత్రకు తగ్గ నటీనటులు దొరక్కపోతే సందీప్ సినిమా కూడా తీయడు. అనిమల్ సినిమాలో రష్మిక పాత్ర కోసం ముందు పరిణితీని అనుకోని షూట్ కూడా చేశాక.. ఆమె ఆ పాత్రకు సెట్ అవ్వదని అనుకోని మధ్యలోనే ఆపేసి.. మళ్లీ రష్మికతో షూటింగ్ ఫినిష్ చేసిన ఘనుడు. అలాంటిది.. ప్రభాస్ కు ధీటుగా ఉండే విలన్ వెతకడంలో అస్సలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటున్నాడు అంట.

makers have approached Bollywood hero Akshay Kumar for the film Spirit

అందుకే స్పిరిట్ కోసం బాలీవుడ్ ఖిలాడీని రంగంలోకి దింపుతున్నాడని తెలుస్తోంది. అవును మీరు విన్నది నిజమే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.. స్పిరిట్ లో విలన్ గా నటించబోతున్నాడని టాక్ నడుస్తోంది. నెగిటివ్ క్యారెక్టర్స్ అక్షయ్ కు కొత్తకాదు. రోబో 2.ఓ లో రజినీ కాంత్ కు ధీటుగా పక్షిరాజు పాత్రలో అక్షయ్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. వంగా సినిమాల్లో హీరోకు ఎంత వెయిట్ ఉంటుందో.. విలన్ కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఇద్దరు సరిసమానంగా ఉండాలని అనుకుంటాడు.

ఇక అనిమల్ లో కూడా బాబీ డియోల్ కు మళ్లీ లైఫ్ ఇచ్చింది సందీపే అన్న విషయం తెల్సిందే. ఇప్పటికే అక్షయ్ ను సంపద్రించాడని, స్క్రిప్ట్ వినిపించినట్లు తెలుస్తోంది. బౌండెడ్ స్క్రిప్టుతో మరోసారి కలిసి ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఒకవేళ ఇదే కనుక నిజమైతే స్పిరిట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X