twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సీటీమార్' ప్లాన్ రివర్స్.. ప్లాన్ బీతో ముందుకు.. ఆయన ఫుల్ హ్యాపీ!

    |

    తెలుగు హీరోలలో గోపీచంద్ స్టైల్ వేరు. మ్యాచో స్టార్ అనే బిరుదు తెచ్చుకున్న ఈ హీరో ఈ మధ్య కాలంలో మాత్రం సరైన హిట్టు ఒక్కటి కూడా కట్టలేక పోతున్నాడు. చివరిగా 2014లో లౌక్యం అనే సినిమాతో గోపీచంద్ హిట్ కొట్టాడు. శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ దాదాపు ఏడెనిమిది సినిమాలు చేశాడు.. కానీ ఒక్క సినిమా కూడా ఆయనకు లక్ తీసుకురాలేదు..

    క్రీడా నేపథ్యంలో

    క్రీడా నేపథ్యంలో

    ఇక ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఆయన ఇంతకుముందు చేసిన సీటీమార్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్స్ గా నటించారు.. క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ లేడీస్ కబడ్డీ జట్టు కోచ్ గా నటించాడు. అలాగే తమన్నా సైతం తెలంగాణ లేడీస్ కబడ్డీ జట్టు కోచ్ గా నటించింది.. ఇక దిగంగన సూర్యవంశి ఒక రిపోర్టర్ పాత్రలో నటించింది.

    రిలీజ్ కి అదే అడ్డంకి

    రిలీజ్ కి అదే అడ్డంకి

    నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ముందు ఒక సారి వాయిదా పడింది. ఆ తరువాత రిలీజ్ చేయాలని భావించినా కరోనా కారణంగా రిలీజ్ చేయలేని పరిస్థితి. అయితే క్యాన్సిల్ చేయడానికి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడమే కారణం అని యూనిట్ ప్రకటించినా అసలు విషయం వేరే ఉందట. గోపీచంద్ మార్కెట్ కంటే ఎక్కువగా నిర్మాత సినిమా కోసం ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.. అందుకే థియేట్రికల్ రైట్స్ విషయంలో ఆయన విస్తుపోయే రేట్లు చెప్పడంతో థియేట్రికల్ బిజినెస్ జరగలేదట.

    ఫుల్ హ్యాపీస్

    ఫుల్ హ్యాపీస్

    దీంతో నిర్మాత నిరాశ చెంది సినిమా రిలీజ్ చేయకుండా ఆపినట్లు సమాచారం. అయితే డిజిటల్ రైట్స్ విషయంలో మాత్రం ఆయన ఇటీవల చర్చలు జరపగా ఆ విషయంలో ఫుల్ హ్యాపీ అని తెలుస్తోంది. అందుకే నేరుగా థియేటర్లో రిలీజ్ చేయకుండా డిజిటల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే మరి థియేట్రికల్ రైట్స్ విషయంలో రాని అమౌంట్ కేవలం ఓటీటీకి లభిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి చాలా సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయిన తర్వాత ఓటీటీకి అమ్ముకుంటారు. కానీ అలా చేయడం వల్ల పెద్దగా అమౌంట్ రాదని అంటున్నారు.

    ఎక్స్క్లూజివ్ కంటెంట్

    ఎక్స్క్లూజివ్ కంటెంట్

    ఆల్రెడీ థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది కాబట్టి అది ఎక్స్క్లూజివ్ కంటెంట్ కాదని, చెబుతూ తక్కువ మొత్తంలోనే ఆ రైట్స్ దక్కించుకుంటాయట ఓటీటీ సంస్థలు. కానీ నేరుగా డిజిటల్ రిలీజ్ చేసే పక్షంలో మాత్రం అది ఎక్స్క్లూజివ్ కంటెంట్ కిందకు వస్తుంది కాబట్టి భారీ రేట్లు వెచ్చించి కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాయని తెలుస్తోంది. అలా ఈ సినిమా కూడా డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుగు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

    Recommended Video

    Prabhas : పొందిన సాయం మర్చిపోని ప్రభాస్.. ఆ హీరో కి డార్లింగ్ అండ | Radhe Shyam || Oneindia Telugu
    ప్లాన్ బీ

    ప్లాన్ బీ

    థియేట్రికల్ రిలీజ్ విషయంలో దెబ్బ పడడంతో ఆ ప్లాన్ పక్కనపెట్టి ప్లాన్ బీతో వెళ్లిన నిర్మాతకు అది బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తోందట. మరి చూడాలి ఈ సినిమా నేరుగా డిజిటల్ రిలీజ్ చేస్తారో లేక థియేట్రికల్ రిలీజ్ చేసి తర్వాత డిజిటల్ రిలీజ్ చేస్తారో అనేది. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మీద శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.. ఆయన గతంలో సమంతతో యూటర్న్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

    English summary
    Macho star Gopichand is struggling to to get a hit after love him in 2014. Gopichand’s Seetimarr deferred its release date not once but twice. vahan the reason for the postponing film is the differences in theatrical rights. producer of Seetimarr kept quoting unusually high prices for the theatrical rights of the film and distributors did not show any interest, considering Gopichand’s recent track record and the pandemic situation. but as per the latest report he is in touch with few OTP platforms. and the produced is happy with the price quoted by OTT platforms.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X