మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. తెలుగుతో పాటు హిందీలో ఆచార్య.. భారీ ప్లాన్?
మెగా ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్, ఎందుకంటే చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ఒకటి హిందీలో కూడా విడుదలవుతుంది. గతంలో చిరంజీవి నేరుగా 3 హిందీ సినిమాలు చేశారు. ఆ తర్వాత ఎందుకో బాలీవుడ్ మీద దృష్టి పెట్ట లేదు కానీ ఇప్పుడు ఆయన బాలీవుడ్ మీద కూడా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన నటిస్తున్న ఆచార్య సినిమా హిందీలో కూడా విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే

'ఆచార్య' సిద్దంగా
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అయితే ముందుగా ఈ సినిమాలో మహేష్ బాబుని ఒక ప్రధాన పాత్ర కోసం తీసుకోవాలి అనుకున్నారు కానీ అనూహ్య కారణాలతో రామ్ చరణ్ తేజ్ ఆ పాత్ర చేయాల్సి వచ్చింది. మహేష్ బాబు పాత్ర చిన్నదే అనుకున్నారు.

హిందీలో కూడా
కానీ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వడంతో మెగా అభిమానులు అందరినీ ఆనందింప చేయడం కోసం ఆయన పాత్ర నిడివి కూడా పెంచారు. అంతే కాక ఆయనకు హీరోయిన్ గా పూజా హెగ్డేని కూడా తీసుకొచ్చారు. చాలా కాలం క్రితం విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధమైంది.. ఇప్పుడు తాజా సమాచారం మేరకు ఈ సినిమాని తెలుగు భాషతో పాటు హిందీలో కూడా ఒకేసారి విడుదల చేయడానికి ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కొనుక్కున్నపెన్ స్టూడియోస్ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.

ఒక రోజు తర్వాత హిందీలో
ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బాలీవుడ్ లో భారీ విజయం సాధించింది. 20 కోట్ల రూపాయలు పెట్టి హక్కులు కొనుకున్న నిర్మాతలకు దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించి భారీ లాభాలు ఆర్జించి పెట్టింది. ఈ నేపథ్యంలోనే సౌత్ సినిమాలకు నార్త్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఆచార్య సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కొనుక్కున్న పెన్ స్టూడియోస్ సంస్థ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తెలుగులో విడుదలైన ఒక రోజు తర్వాత హిందీలో విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుందని అంటున్నారు.

డబ్బింగ్ పనులు కూడా
ఈ మేరకు దర్శక నిర్మాతల దగ్గర అనుమతి కూడా తీసుకుని డబ్బింగ్ పనులు కూడా ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు సమాచారం. నిజానికి పెన్ స్టూడియోస్ సంస్థ ఇప్పటికే తెలుగు సినిమాల మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే ఖిలాడీ సినిమాను విడుదల చేసిన సదరు సంస్థ RRR సినిమాను బాలీవుడ్ లో అదే సంస్థ విడుదల చేస్తోంది. అంతే కాక బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ సినిమాను కూడా నిర్మిస్తోంది.

మార్కెట్ పెరుగుతుందని
ఇప్పుడు అదే సినిమా ఆచార్య సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. మెగాస్టార్ కూడా రామ్ చరణ్ RRR విడుదల తర్వాత హిందీ మార్కెట్ బాగుంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళ్ సినిమా కూడా అక్కడ మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉందని మంచి మార్కెట్ కూడా అవుతుంది అని భావిస్తూ పెన్ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











