52 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమ.. ఆ బిజినెస్ మ్యాన్ తో స్టార్ హీరోయిన్ డేటింగ్!
బాలీవుడ్ స్టార్ డ్యాన్సర్,నటి మలైకా ఆరోరా (Malaika Arora) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్య అనే పాటతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు మలైకా. తెలుగులో అతిథి, గబ్బర్ సింగ్ సినిమాలతో టాలీవుడ్ క పరిచయమాయ్యరు. సినిమాలతో పాటు నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా, జడ్జీగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఈ భామ తన సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజా మరోసారి డేటింగ్ రూమార్స్ తో వార్తల్లో నిలిచింది.
మలైకా ముందుగా నటుడు అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకుంది. 2017లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఆమె తన కంటే 12 సంవత్సరాలు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది.వారిద్దరూ సుమారు ఆరు సంవత్సరాలు రిలేషన్‌లో ఉన్నారని టాక్. ఇంత పెద్ద వయసు అంతరం ఉన్నప్పటికీ, అర్జున్-మలైకా కెమిస్ట్రీ, జోడీ చాలా మందికి నచ్చింది.అయితే ఏమైందో తెలియదు కానీ గత ఏడాది వీరి సడెన్ గా విడిపోయారు. ఈ బ్రేకప్ తర్వాత మలైకా కొత్త రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టిందా? అన్న చర్చ జరుగుతోంది.

మరోసారి మలైకా ఆరోరా పర్సనల్ లైఫ్ కారణంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ఇటీవల అర్జున్ కపూర్ తో మలైకా బ్రేకప్ అయిన విషయం తెలిసిందే. ఈ బ్రేకప్ తర్వాత మలైకా కొత్త రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టిందా? అన్న చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది. ఎందుకంటే.. అర్జున్ తో విడిపోయిన తర్వాత, మలైకా ఒక యువ వ్యాపారవేత్తతో ఎక్కువగా కనిపిస్తోంది. ముంబైలో జరిగిన ఒక సంగీత కార్యక్రమంలో వీరిద్దరూ జంటగా కనిపించారు. తాజాగా ఇటలీలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన ట్రెవి ఫౌంటెన్ (Trevi Fountain) వద్ద మలైకా ఓ మిస్టరీ మ్యాన్ తో కనిపించిన ఫోటో వైరల్ కావడమే. ఈ ఫోటో వైరల్ కావడంతో డేటింగ్ రూమార్స్ మరింత జోరందుకున్నాయి.
రెడిట్‌లో షేర్ అయిన ఆ ఫోటోలో మలైకాతో పాటు ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటూ కనిపించాడు.దీంతో నెటిజన్లు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు. వాలెంటైన్స్ డే రోజున ట్రెవి ఫౌంటెన్ వద్ద మలైకా తన బాయ్‌ఫ్రెండ్‌తో స్పాట్ అయ్యిందా?" అంటూ నెటిజన్లు క్యాప్షన్లు పెట్టడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొందరు ఇది పీఆర్ స్టంట్ అయ్యుండొచ్చని అంటుండగా, మరికొందరు మలైకా నిజంగానే మూవ్ ఆన్ అయిందని కామెంట్లు చేస్తున్నారు.
ఆ బిజినెస్‌మ్యాన్ ఎవరు?
సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. మలైకాతో కనిపించిన 33 ఏళ్ల వ్యక్తి పేరు హర్ష్ మెహతా , ఆయన ప్రముఖ వజ్రాల వ్యాపారి, అలాగే సంకాస్ మేనేజ్‌మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారని టాక్. అయితే ఈ విషయంపై అధికారిక ధృవీకరణ మాత్రం లేదు. మలైకా ప్రస్తుతం 52 ఏళ్ల వయస్సులో ఉంది. హర్ష్ వయస్సు 33 సంవత్సరాలు అని ప్రచారం. అంటే వీరిద్దరి మధ్య దాదాపు 19 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇదే అంశం నెట్టింట ప్రధాన టాపిక్‌గా మారింది.
మలైకా స్పందన
గతంలో ఓ చాట్ షోలో మలైకా గాసిప్‌లపై స్పందిస్తూ.. 'నేను ఎవరి దగ్గర కనిపించినా వెంటనే లింక్ పెడతారు.పాత స్నేహితుడైనా, మేనేజర్ అయినా... అనవసరంగా స్టోరీలు క్రియేట్ చేస్తారు. నేను బయటకు వెళ్లి నవ్వుతూ మాట్లాడితే అంత మాత్రాన ప్రేమలో ఉన్నట్టేనా?' అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై ఇప్పటివరకు మలైకా లేదా ఆమె టీమ్ నుంచి కొత్త రిలేషన్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మలైకా అరోరా నిజంగానే కొత్త ప్రేమలో పడిందా? లేక ఇది కేవలం సోషల్ మీడియా ఊహాగానాలేనా? అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు సస్పెన్స్ గానే ఉంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మలైకా పర్సనల్ లైఫ్ ఎప్పటికీ నెట్టింట హాట్ టాపిక్‌గానే ఉంటుంది.


Click it and Unblock the Notifications











