52 ఏళ్ల వయసులో కుర్రాడితో హీరోయిన్ డేటింగ్? ప్రియుడితో సరసాలాడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా..

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇటీవలే టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ వెంటనే టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. అయితే కొందరు నటీనటులు మాత్రం సుదీర్ఘ కాలంగా డేటింగ్‌లు, ఎఫైర్లలో మునిగి తేలుతున్నారు. ఈ లిస్ట్‌లో ముందు వరుసలో ఉంటారు బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. ఈ ముదురు భామ ఎప్పుడు? ఎవరితో రిలేషన్‌లో ఉంటారో? ఎవరికి బ్రేకప్ చెబుతారో? ఊహించడం కూడా చాలా కష్టం. బట్టలు మార్చుకున్నంత ఈజీగా బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చేస్తూ.. ఐదు పదుల వయసు దాటినా హాట్ న్యూస్‌తో నిత్యం వార్తల్లో ఉంటారు. తాజాగా మలైకా అరోరా మళ్లీ ప్రేమలో పడిందని.. ఓ కుర్రాడితో డేటింగ్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్‌గా
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సరసన ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్య అనే పాటతో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపారు మలైకా అరోరా. స్పెషల్ సాంగ్స్‌కి స్పెషలిస్ట్‌గా మారి.. 90వ దశకంలో తన హవా సాగించారు. అప్పట్లో బాలీవుడ్‌లో ఏ స్పెషల్ సాంగ్ అయినా మలైకా ఉండాల్సిందే అన్నంతగా తనదైన ముద్రవేశారు. తెలుగులో 2007లో మహేశ్ బాబు హీరోగా నటించిన అతిథిలో ప్రత్యేక గీతంతో తెలుగువారిని పలకరించారు మలైకా అరోరా. మధ్యలో తన వయసు పెరగడం, కుర్ర భామల రాకతో మలైకా జోరు తగ్గింది. అయితే దబాంగ్‌లో మున్నీ బద్నాం సాంగ్‌తో తనలో వాడి ఇంకా తగ్గలేదని నిరూపించారు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్‌లో కెవ్వు కేక అంటూ ఊపేశారు. సినిమాలతో పాటు నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా, మోడల్‌గా దూసుకెళ్తున్నారు మలైకా అరోరా.

Malaika Arora Dating Rumours Again Is She in Love with Saurabh Bedi

అర్బాజ్ ఖాన్‌తో పెళ్లి, విడాకులు
సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను 1998లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మలైకా అరోరా. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. అయితే ఈ జం అనూహ్యంగా తమ 20 ఏళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ విడాకులు తీసుకున్నారు. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్‌‌తో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచారు మలైకా అరోరా. అతనితోనూ బంధం ఎక్కువ రోజులు సాగలేదు. ఆ తర్వాత శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరతో మలైక డేటింగ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

హర్ష్ మెహతాతో ప్రేమాయణం?
కొద్దిరోజుల క్రితం తన కొడుకు వయసున్న కుర్రాడితో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ముంబైలో జరిగిన ఎన్రిఖ్ ఇగ్లేసియాస్ లైవ్ కన్సర్ట్‌లో మలైక పాల్గొన్నారు. ఇందులో తన ఫ్రెండ్స్, ఇతర సెలబ్రిటీలతో పాటు ఓ కుర్రాడితో క్లోజ్‌గా కనిపించారు. 33 ఏళ్ల ఈ కుర్రాడి పేరు హర్ష్ మెహతా.. ఇతనికి బెల్జియంలో డైమండ్ కంపెనీ ఉండగా, మరికొన్ని వ్యాపారాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే కుర్రాడితోనూ మలైకా బ్రేకప్ చెప్పినట్లుగా తెలుస్తోంది.

సోరబ్ బేడీతో క్లోజ్‌గా?
కట్ చేస్తే మరోసారి కొత్త ప్రియుడితో మలైకా అరోరా ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అతని పేరు సోరబ్ బేడీ. స్ప్లిట్‌విల్లా ఎక్స్6తో పాపులర్ అయిన ఈ కుర్రాడి వయసు 32 సంవత్సరాలు. ముంబై జుహు ఏరియాలో ఉన్న మలైకా రెస్టారెంట్‌లో జరిగిన వేడుకకు సోరాబ్ హాజరవ్వగా.. అతనితో కలిసి ఈ ముదురుభామ డ్యాన్స్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోలలో అతని కౌగిలిలో సెల్ఫీలు దిగుతున్నట్లుగా ఉంది. దాంతో సోరబ్‌తో మలైక పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more about: malaika arora bollywood news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X