పెళ్లి వద్దు కానీ ఫుల్లుగా ఎంజాయ్ చేద్దాం.. స్టార్ హీరోకు హీరోయిన్ దిమ్మతిరిగే షాక్

మిగిలిన సినిమా ఇండస్ట్రీల కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువగా లవ్ ట్రాకులు, డేటింగ్‌లు, బ్రేకప్‌లు కనిపిస్తుంటాయి. అక్కడ సినీ తారల మధ్య ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు కూడా చాలా మందే హీరో, హీరోయిన్లు ప్రేమాయణం సాగిస్తున్నారు. అలాంటి వారిలో మలైకా అరోరా, అర్జున్ కపూర్ జంట ఒకటి. చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతోన్న వీళ్లిద్దరూ.. ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మలైకా అరోరా, అర్జున్ కపూర్ మధ్య ఊహించని విధంగా విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూడండి!

మలైకా, అర్జున్ జర్నీలిలా:మలైకా అరోరా మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, నటిగా కంటే 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్‌ హుయే' వంటి స్పెషల్ సాంగ్స్‌తో పాపులర్ అయింది. ఇక, బోనీ కపూర్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అర్జున్ కపూర్. అలా ఎన్నో హిట్లతో స్టార్ హీరోగా మారాడు.

Malaika Arora Gives Shock to Arjun Kapoor about Marriage

సీక్రెట్ లవ్ నుంచి డైరెక్ట్:చాలా ఏళ్లుగా అర్జున్ కపూర్.. మలైకా అరోరా ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో చాలా రహస్యంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీళ్లిద్దరూ.. ఎన్నోసార్లు జంటగా కెమెరాలకు చిక్కారు. ఆ తర్వాత ఇది పెద్ద హాట్ టాపిక్ అవడంతో బహిరంగంగానే ఒప్పుకున్నారు. అర్జున్ ఈ విషయాన్ని ఓ షోలోనే ప్రకటించాడు. మలైకా సోషల్ మీడియా ద్వారా మేటర్ లీక్ చేసింది.

చిన్నోడే అయినా రచ్చ:వాస్తవానికి మలైకా అరోరాకు చాలా ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. కానీ, భర్తకు ఆమె విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత అర్జున్ కపూర్‌తో డేటింగ్ ప్రారంభించింది. వీళ్లిద్దరి మధ్య 12 ఏళ్ల ఏజ్ డిఫరెన్స్ ఉంది. దీంతో ఈ జంట ఆరంభం నుంచే హైలైట్ అవుతోంది. ముఖ్యంగా వయసులో చిన్నోడే అయినా మలైకా.. అర్జున్ కపూర్‌తో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ రచ్చ లేపుతోంది.

Malaika Arora Gives Shock to Arjun Kapoor about Marriage

అప్పుడే జంటగా మారి:డేటింగ్ వ్యవహారం బయటకు వచ్చేసిన తర్వాత మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్ మరింతగా ఎంజాయ్ చేస్తోంది. జంటగా ఉండేందుకు ముంబైలో ఓ విలాసవంతమైన ఫ్లాట్‌ను కూడా కొనుక్కున్నారు. అక్కడే కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ విషయాన్ని కూడా వాళ్లే స్వయంగా చెప్పుకున్నారు. అలాగే, నిత్యం టూర్లకు వెళ్తూ యమా చిల్ అవుతున్నారు.

పెళ్లి అనుకుంటే గ్యాప్:అర్జున్ కపూర్, మలైకా అరోరా దాదాపు పదేళ్లకు పైగానే డేటింగ్‌లో ఉన్నారు. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఎన్నో ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఇప్పటికే చాలా డేట్లు కూడా తెరపైకి వచ్చాయి. అయినప్పటికీ వీళ్లిద్దరి వివాహం మాత్రం జరగలేదు. దీనికితోడు ఈ మధ్య కాలంలో వీళ్లిద్దరూ కాస్త దూరం దూరంగానే ఉంటున్న విషయం తెలిసిందే.

Malaika Arora Gives Shock to Arjun Kapoor about Marriage

షాక్ ఇచ్చిన అమ్మడు:మలైకా - అర్జున్ మధ్య విభేదాలు వచ్చాయని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై ఓ న్యూస్ వైరల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితమే అర్జున్.. మలైకా ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టాడట. కానీ, ఆమె మాత్రం 'పెళ్లి వద్దు.. ఫుల్లుగా ఎంజాయ్ చేద్దాం' అన్నట్లుగా చెప్పినట్లు తెలిసింది. అప్పటి నుంచే వీళ్ల మధ్య దూరం పెరిగిందని ఓ న్యూస్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X