యంగ్ హీరోతో బ్రేకప్.. ఇప్పుడు ఫారిన్ క్రికెటర్‌తో?.. 51 ఏళ్ల వయసులో హీరోయిన్ సంచలనం!

నటీనటుల మధ్య బ్రేకప్స్, ఎఫైర్స్ , పెళ్లిళ్ల వంటివి సర్వసాధారణం. కుర్ర హీరోలు, హీరోయిన్లు అలా చేశారంటే ఏదో అనుకోవచ్చు. కానీ 50 ప్లస్‌లోనూ తన ఎఫైర్స్‌తో హల్ చల్ చేస్తున్నారు బాలీవుడ్ సీనియర్ బ్యూటీ మలైకా అరోరా. తన హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో సెగలు రేపే మలైకా.. ఎప్పుడు ఎవరితో డేటింగ్‌లో ఉంటారో? ఎవరితో బ్రేకప్ చెబుతారో? అంటూ బాలీవుడ్ మీడియా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే.

అప్పుడెప్పుడో కింగ్‌ఖాన్ షారుఖ్ ఖాన్ సరసన ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్య అనే పాటతో 90వ దశకంలో భారతీయ చిత్ర పరిశ్రమను ఒక ఊపారు పంజాబీ ముద్దుగుమ్మ మలైకా అరోరా. స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్‌గా నిలిచిన మలైకా ఈ దెబ్బతో వెనుదిరిగి చూసుకోలేదు. బాలీవుడ్‌లో ఏ స్పెషల్ సాంగ్ అయినా మలైకా ఉండాల్సిందే అన్నంతగా ముద్ర వేసుకుంది. తెలుగులోనూ 2007లో వచ్చిన మహేశ్ బాబు అతిథిలో మెరిశారు మలైకా అరోరా.

Malaika Arora seen with Kumar Sangakkara during rajasthan royals vs chennai super kings match

తిరిగి సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్‌లో మున్నీ బద్నాం సాంగ్‌తో మరోసారి మాస్‌ను ఊపశారు మలైకా. దీనిని పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగులో రీమేమ్ చేసిన గబ్బర్ సింగ్‌లో కెవ్వు కేక అంటూ చేసిన పాటతో తెలుగునాట కుర్రాళ్లకు సెగలు రేపారు. గతేడాది ఏక్ నెంబర్ అంటూ మరోసారి హల్ చల్ చేశారు. సినిమాలతో పాటు నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా, న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న మలైకా బిజీగా ఉంటున్నారు. సినిమాలు, సాంగ్స్ కంటే వ్యక్తిగత విషయాలు, వివాదాస్పద అంశాలతోనే వార్తల్లో నిలుస్తుంటారు మలైకా అరోరా.

సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను 1998లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మలైకా అరోరా. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. దాదాపు 20 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరదించుతూ ఈ జంట విడాకులు తీసుకోవడం కలకలం రేపింది. ఈ జంట విడిపోవడంతోనే షాకైనా బాలీవుడ్‌కు ఆ వెంటనే మరో షాకిచ్చారు మలైకా.. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన యువ హీరో అర్జున్ కపూర్‌‌తో డేటింగ్ చేసింది. కానీ అతనితోనూ బంధాన్ని కంటిన్యూ చేయలేక త్వరగానే బ్రేకప్ చెప్పేసింది మలైకా.

ప్రస్తుతానికి తన ప్రేమ జీవితానికి మలైకా ఫుల్ స్టాప్ పెట్టారని అంతా అనుకున్నారని కానీ అందరికీ షాకిచ్చేలా ఈమెకు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025)లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సమయంలో శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కరతో కలిసి మలైకా కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. బయటి వ్యక్తులకు ఎంట్రీ లేని టీమ్ డగౌట్‌లో ఇద్దరూ రాజస్థాన్ రాయల్స్ జెర్సీని ధరించి పక్కపక్కనే కూర్చొన్నారు. దీంతో మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్ దొరికాడా? కుమార సంగక్కరను ఆమె ప్రేమిస్తుందా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి వీరిద్దరూ నిజంగానే ప్రేమలో పడ్డారా? మ్యాచ్ సందర్భంగా కలిశారా? అన్నది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X