RC16: రామ్ చరణ్ మూవీలో మరో హీరోయిన్.. ముందే లీకైన అసలైన సర్‌ప్రైజ్
టాలీవుడ్‌లో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో సత్తా చాటుతున్న చరణ్.. ఇప్పుడు వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇలా ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తీస్తున్నారు. ఇక, ఈ సినిమా పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సనతో మరో భారీ ప్రాజెక్టును లైన్‌లో పెట్టేసుకున్నాడు.

రామ్ చరణ్ - బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా క్రీడా నేపథ్యంతో రాబోతుందని ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, ఇందులో హీరో రన్నర్‌గా నటిస్తున్నాడని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందనే టాక్ వినిపిస్తోంది.
హై రేంజ్ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనున్న ఈ సినిమాలో ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్లు భాగం కాబోతున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తెను తీసుకున్నారు. ఇటీవలే జరిగిన పూజా కార్యక్రమాల్లో సైతం ఆమె భాగం అయింది. ఈ నేపథ్యంలో ఇందులో మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు తాజాగా న్యూస్ లీకైంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మాళవిక మోహనన్ కూడా నటిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఆమె పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందట. సినిమాలో ఈ రోల్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని అంటున్నారు. అందుకే ఆమె గురించి చిత్ర యూనిట్ సీక్రెట్‌గా ఉంచిందట. కానీ, తాజాగా ఈ న్యూస్ బయటకు రావడంతో ఈ మూవీపై హైప్ పెరిగిపోతోంది.
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో రూపొందిస్తోన్న ఈ సినిమా దాదాపు రూ. 400 కోట్లు బడ్జెట్‌తో రూపొందనుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. దీనికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











