ప్రభాస్ కోసం రంగంలోకి హాట్ భామ.. మారుతి ప్లాన్ మామూలుగా లేదుగా!
పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ వరుస సినిమాలు ఒప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఈ సినిమా తరువాత ఆయన వరుస సినిమాలు లైన్ లో పెట్టారు. ఆయన హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో హాట్ హీరోయిన్ ను రంగంలోకి దించుతున్నారని టాక్ వినిపిస్తోంది. కామెడీ సినిమాలు తీసి టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ మారుతి. ఇక ఆయన పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు టాక్. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోయే ప్రాజెక్టు గురించి ఆసక్తికర వార్త ఒకటి ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్ కోసం మారుతి చాలా మంది స్టార్ హీరోయిన్లను సంప్రదించినా ఎవరూ ఒప్పుకోలేదని అంటున్నారు. అయితే సినిమా అవకాశాలు పెద్దగా లేని మెహరీన్ ఫిర్జాదా కూడా ఈ సినిమాలో చేయలేనని చెప్పేసిందట. ఈ క్రమంలో మారుతి సినిమాలోని హీరోయిన్ రోల్ కోసం ఓ అందాల భామను ఫైనల్ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఆమె మరెవరో కోలీవుడ్ భామ మాళవిక మోహనన్. సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరు సంపాదించిన మోహనన్ కుమార్తె అయిన మాళవిక ముంబైలో జన్మించారు. ముంబైలో జన్మించడంతో ఆమె అక్కడే తన చదువు పూర్తి చేసి తండ్రికి అసిస్టెంట్ గా షూట్స్ కి వెళ్ళేది. అలా వెళుతున్న సమయంలో మమ్ముట్టి తన కుమారుడు సల్మాన్ హీరోగా రూపొందుతున్న సినిమాలో ఆమెకు హీరోయిన్ అవకాశం ఇచ్చారు.

ఆ తర్వాత కన్నడ, హిందీ, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది. మలయాళంలో నిర్ణాయకం, ది గ్రేట్ ఫాదర్ లాంటి చిత్రాల్లో, కన్నడంలో నన్ను మట్టు వరలక్ష్మి, తమిళంలో పెట్టా, మాస్టర్ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించింది. అయితే ప్రభాస్ తో సినిమా విషయం మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రభాస్ కి చాలా ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. సలార్ మరియు ప్రాజెక్ట్ కె కాకుండా, ఆయ్న ఆదిపురుష్ ,అలాగే స్పిరిట్ సినిమాలో కూడా కనిపించనున్నాడు. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్ లో ఆయన ఉన్నారు. ఆయన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కూడా కనిపించనున్నాడు. వచ్చే ఏడాది సలార్, ఆదిపురుష్ విడుదల కానున్నాయి.



Click it and Unblock the Notifications











