Prabhas: సలార్ లో మెయిన్ విలన్ అతనేనా.. ప్రశాంత్ నీల్ భయంకరమైన ప్లాన్!

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా కంటే ఎక్కువగా సలార్ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు అని చెప్పవచ్చు. ఇప్పటివరకు రాధేశ్యామ్ సినిమాపై అయితే పెద్దగా అంచనాలు లేవు. చిత్ర యూనిట్ సభ్యులు కూడా ప్రమోషన్ విషయంలో మెల్లగా అడుగులు వేస్తుండటంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇక అందరి ఫోకస్ మాత్రం ఎక్కువగా సలార్ సినిమా పైనే ఉంది. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటించింది ఎవరు అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

కేజీఎఫ్ కంటే భారీగా..

కేజీఎఫ్ కంటే భారీగా..

సలార్ సినిమాకు సంబంధించిన పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ఇక అప్పుడప్పుడు కొన్ని లోకేషన్స్ సీన్స్ కూడా సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా ట్రెండ్ ఇవ్వడం జరిగింది. ఇక సలార్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇదివరకే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కూడా కేజిఎఫ్ చాప్టర్ టు కంటే ఎంతో భారీగా తెరకెక్కించడం జరుగుతోందట.

 మెయిన్ విలన్ హైలెట్..

మెయిన్ విలన్ హైలెట్..

సలార్ యాక్షన్ విషయంలో అయితే అసలు వెనక్కి తగ్గడం లేదు. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటించింది ఎవరు అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. కేజిఎఫ్ సినిమాలో దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో పాత్రను ఎలా అయితే ప్రజెంట్ చేశాడు అంతకంటే ఎక్కువగా పవర్ ఫుల్ గా విలన్ పాత్రలను కూడా హైలెట్ చేశాడు. ఆ దెబ్బతో హీరో పాత్ర స్థాయి కథలో అంతకంతకు పెరుగుతూ వచ్చింది. సలార్ సినిమాలో మెయిన్ విలన్ కూడా చాలా భయంకరంగా కనిపిస్తాడని తెలుస్తోంది.

 మెయిన్ విలన్ అతనేనా

మెయిన్ విలన్ అతనేనా

మెయిన్ విలన్ ఎవరు అనేది ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం టాక్ ప్రకారం.. సీనియర్ మలయాళం నటుడు హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఒక వైలెంట్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే ఈ టాలెంటెడ్ నటుడు కొన్ని సినిమాల్లో నెగటివ్ పాత్రల్లో కనిపించాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ కు ప్రత్యర్థిగా కూడా అతి భయంకరమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించే అవకాశం ఉందట.

Recommended Video

Prabhas Supremacy.. ఈ ఆధిపత్యం అనితర సాధ్యం | Prabhas 25 | Spirit || Filmibeat Telugu
కొన్ని రోజుల పాటు ఆలోచించుకొని..

కొన్ని రోజుల పాటు ఆలోచించుకొని..

దర్శకుడు ప్రశాంత్ విలన్ పాత్ర గురించి చెప్పిన తర్వాత కొన్ని రోజులపాటు ఆలోచించుకున్న పృథ్వి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఈ విషయంలో సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న చిత్రయూనిట్ త్వరలోనే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి నిజంగానే పృథ్వి విలన్ గా నటిస్తున్నాడా లేదా అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సలార్ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అభిమానులు మాత్రం ఈ సినిమాకు సంబందించిన మొదటి టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి ఆ రోజు టీజ4 లాంటిది ఏమైనా విడుదల చేస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X