త్రాగి డ్రైవ్ చేస్తున్న హీరోయిన్ అరెస్టు!!

By Staff

Sangeetha Mohan
త్రాగటానికి ఆడా మెగా తేడా లేకపోయినా...త్రాగి డ్రైవ్ చేస్తూ పట్టుపడే కేసుల్లో మొగవాళ్ళే అధికం. అయితే గ్లామర్ పరిశ్రమలో మాత్రం ఆడవాళ్ళు మొగవాళ్ళు కన్నా బాగా సంపాదిస్తూ...తమ దైన శైలిలో రెచ్చిపోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తూ మళయాళ ముధ్దుగుమ్మ సంగీత మోహన్(29) అరెస్టుని చేసారు. ఆమె త్రివేండ్రమ్ లో డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తూ దొరికిపోయింది. వేగన్ ఆర్ కారులో వెళ్తున్న ఆమె కారు డ్రైవింగ్ సరిగా చేయకపోవటాన్ని పెట్రోలింగ్ పోలీసులు గమనించారు.ఆపు చేసి డోర్ తీయమన్నా ఆమె మొదట రిప్యూజ్ చేసింది. అయితే సురేష్ కుమార్ అనే ఆ సర్కిల్ ఇన్సపెక్టర్ గ్లాసులు బ్రద్దలు కొట్టడానికి ప్రయత్నించటానికి ప్రయత్నించటంలో ఆమె తెరవతప్పలేదు.

లోపల చూస్తే లిక్కర్ బాటిల్స్,నంచుకోవటానికి స్టఫ్ చాలా ఉన్నాయి.అయితే ఆ సమయంలో ఆమెతో పాటు ఓ తెలుగు నిర్మాత ఒకరు ఉన్నారని సమాచారం. అతను మాత్రం తెలుగు రాకపోయినా తన తెలివితో మేనేజ్ చేసి తప్పించుకున్నాడని సమాచారం. కానీ ఆమెను మాత్రం పోలీసులు గవర్నమెంట్ హాస్పటిల్ కి మెడికల్ ఎగ్జామినేషన్ కోసం తీసుకెళ్ళారు. తర్వాత బెయిల్ మీద వదిలేసారు. ఇక మన నిర్మాత బ్రతుకు జీవుడా అని కేరళ వదిలిపెట్టాడు. మళయాళ హిట్ రీమేక్ రైట్స్ తెస్తానని వెళ్ళిన ఆయనకు ఆమెతో ఏం పని అంటే ఆమెను తెలుగులో పరిచయం చేయటానికి అని నిలదీసినవారితో సమాధానం చెప్తున్నాడు.

ఇక ఆయన ఆ పెద్దమనిషి ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ ద్వారా ఇక్కడ పాపులర్. తెల్లారి లేచి ప్రెస్ మీట్ లలో కనపడే ఆయన అక్కడ కనపడ్డాడని ఇరుక్కున్నాడని తెలిసిన ఇండస్ట్రీ వ్యక్తులు షాకయి...తాము మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ చేసుకున్నారు. ఇక ఆమె అడపా దడపా సినిమాల్లో నటిస్తూ...సీరియల్స్ లో హీరోయిన్ గా పాపులర్ అయింది. అక్కడ ఆమె చాలా పవిత్రమైన పాత్రలు చేస్తూంటుంది. ఏదైమైనా త్రాగి డ్రైవింగ్ చేయటం తప్పని ఆమె,అలా పరాయి రాష్ట్రానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈయన నిర్ణయాలు తీసుకున్నారు. ఇంతకీ ఆ పెద్దాయన ఎక్కువగా మళయాళ సినిమా రీమేక్స్ తీసి తెలుగులో హిట్స్ ఇచ్చాడు గతంలో గుర్తొచ్చిందా...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X