ప్రభాస్ యాక్షన్ సినిమాలో మరో అగ్ర హీరో.. KGF డైరెక్టర్ బిగ్ ట్విస్ట్.. కాంబో సెట్టయితే బాక్సాఫీస్ బద్దలే..

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి అనంతరం అంతకంతకు సినిమాల డోస్ ను పెంచుతున్న విషయం తెలిసిందే. సాహో అనంతరం కాస్త చిన్న సినిమాలను చేయాలని అనుకున్న ఈ అగ్ర హీరో ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా కథలను లైన్ లో పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకేసారి నాలుగు సినిమాల వార్తలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. ఇక ప్రభాస్ చేయనున్న బిగ్ బడ్జెట్ యాక్షన్ సినిమాలో ఒక సీనియర్ హీరో కూడా నటించనున్నట్లు తెలుస్తోంది.

ఆ సినిమా తరువాత మరింత బిజీగా..

ఆ సినిమా తరువాత మరింత బిజీగా..

ఎలాగైనా వీలైనంత త్వరగా రాధేశ్యామ్ సినిమాను ఫినిష్ చేయాలని ప్రస్తుతం ప్రభాస్ బిజీబిజీగా షూటింగ్ తో గడుపుతున్నారు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఆ సినిమాను ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్స్ యూవీ క్రియేషన్స్ తో పాటు గోపికృష్ణ కూడా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కకేస్తున్నాయి. ఇక ఆ సినిమా తరువాత ప్రభాస్ మరింత బిజీ కానున్నాడు. వచ్చే మూడేళ్ళలో మరో సినిమా ఒకే చేయలేని పరిస్థితి ఏర్పడింది.

ఆసక్తిగా మారిన ప్రభాస్ లైనప్..

ఆసక్తిగా మారిన ప్రభాస్ లైనప్..

ప్రభాస్ రాధేశ్యామ్ తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను, అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాను చేయనున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభాస్ లైనప్ ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఆ దెబ్బతో సలార్ పై పెరిగిన అంచనాలు

ఆ దెబ్బతో సలార్ పై పెరిగిన అంచనాలు

అయితే సలార్ సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కొనసాగే ఒక రివెంజ్ డ్రామా తరహాలో ఉంటుందట. దర్శకుడు ప్రశాంత్ మేకింగ్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పాత్రలతోనే ట్విస్ట్ ఇస్తాడాని KGF మొదటి పార్ట్ తోనే రుజువు చేశాడు. ఇక సెకండ్ పార్ట్ లో అంతకు మించిన యాక్షన్ డోస్ తో పాటు సరికొత్త ట్విస్టులు ఉంటాయని హైప్ క్రియేట్ చేశారు. ఆ దెబ్బతో ప్రభాస్ సలార్ పై కూడా అంచనాలు గట్టిగానే పెరిగాయి.

ప్రభాస్ సినిమాలో మోహన్ లాల్

ప్రభాస్ సినిమాలో మోహన్ లాల్

ఇక ఆ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలో ఒక అగ్ర హీరోను స్పెషల్ పాత్రలో చూపించబోతున్నారట. ఆ హీరో మరెవరో కాదు. ఇండియన్ కంప్లీట్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ లాల్. ఈ స్టార్ ప్రభాస్ తో సమానంగా ఉండే ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్.

బలమైన పాత్ర కావడంతో..

బలమైన పాత్ర కావడంతో..

గతంలో జూనియర్ ఎన్టిఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ ఒక స్పెషల్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత టాలీవుడ్ నుంచి పలు ఆఫర్లు వచ్చినప్పటికీ క్యారెక్టర్లు నచ్చక ఒప్పుకోలేదట. ఇక ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్టు సలార్ లో బలమైన పాత్రలో నటించే ఆఫర్ రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X