twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRRలో మరో స్టార్ హీరో.. ఎన్టీఆర్ కోసం రాజమౌళి సెర్చింగ్?

    |

    టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ RRR పై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా బాలీవుడ్ కి ధీటుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరొక సీనియర్ హీరో కూడా వీరితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

    Recommended Video

    RRR: Malayalam Super Star Mohanlal in RRR For The Role of NTR’s Uncle
     టైటిల్ తోనే కొట్టేశాడు..

    టైటిల్ తోనే కొట్టేశాడు..

    డైరెక్టర్ రాజమౌళి ఆలస్యం చేసినా కూడా ఆ సినిమా తాలూకు ప్రభావం జనాలు మర్చిపోకుండా చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని అందరికి తెలిసిందే. లేట్ చేసినా కూడా ఆడియెన్స్ ని సంతృప్తి పరచడంలో ఆయనకి ఆయనే సాటి. 'రౌద్రం రణం రుధిరం' అంటూ సినిమాకు సంబంధించిన ఫుల్ టైటిల్ ని స్ట్రాంగ్ గా ఎనౌన్స్ చేసిన విధానం ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసింది.

     ఎన్టీఆర్ కోసం సెర్చింగ్..

    ఎన్టీఆర్ కోసం సెర్చింగ్..

    రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ పాత్రకు సంబంధం ఉండే ఒక స్పెషల్ పాత్ర కోసం మంచి క్రేజ్ ఉన్న నటుడిని సెలెక్ట్ చేసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఒక రూమర్ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొమురం భీమ్ సపోర్టింగ్ గా ఉండే ఒక పవర్ఫుల్ పాత్ర కోసం రాజమౌళి ఒక స్టార్ యాక్టర్ కోసం సెర్చ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

     RRRలో మలయాళం స్టార్..

    RRRలో మలయాళం స్టార్..

    మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ RRRలో నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. అసలైతే కొన్నిరోజుల తరువాత మరొక స్టార్ హీరో కోసం రాజమౌళి సెర్చింగ్ మొదలుపెట్టాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఖాళీగా ఉన్న సమయంలోనే కొన్ని నిర్ణయలపై ఒక ఆలోచనకు వస్తే బెటర్ అని మోహన్ లాల్ ని ఆ స్పెషల్ రోల్ కోసం సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారట. ఇకపోతే ఇదివరకే మోహన్ లాల్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ లో నటించిన విషయం తెలిసిందే.

     రిలీజ్ వాయిదా పడకుండా..

    రిలీజ్ వాయిదా పడకుండా..

    RRR సినిమా షూటింగ్ స్పీడ్ అందుకున్న సమయంలో లాక్ డౌన్ ఊహించని బ్రేక్ వేసింది. దీంతో షెడ్యూల్స్ లో భారీ మార్పులు చేయక తప్పదు. మరొక ప్లాన్ రెడీ చేసుకోవాలని దర్శకనిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. అయితే రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పులు చేయకుండా చెప్పిన తేదికే సినిమాను రిలీజ్ చేయాలని దొరికిన సమయంలొనే సినిమా పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారట.

    English summary
    latest buzz that’s doing the rounds reveals that malayalam star actor Mohanlal will be playing a key role in RRR. Apparently, Mohanlal is being considered for the role of Komaram Bheem’s uncle in the movie,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X