మల్లెపూవు చిత్రానికి మూలం?

ఆ కథ మొత్తం ఓ బిల్డింగ్ కనస్ట్రక్షన్ జరిగే చోట..పనుల కోసం వలస వచ్చిన వారి మథ్య జరుగుతుంది. అందులో హీరోయిన్ బ్రతుకు తెరువు కోసం మొగవాడి వేషం వేసుకుని తాపీ పనులో చేరుతుంది. ఎందుకంటే అక్కడ ఆడవాళ్ళు బయిటకు వచ్చి పనులు చేయిటం నిషిధ్ధం. అలా వచ్చిన ఆమెతో అక్కడపనిచేసుకుంటున్న మరో తాపీ కుర్రాడు తెలియక మొదట గొడవపడతాడు. తరువాత ప్రేమలో పడతాడు. అక్కడ నుండి తను దాచుకున్న డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆమె కుటుంబానికి ఇచ్చి సాయం చేస్తాడు. అలా ఆమె ప్రేమను పొందుదామనుకుంటాడు. కాని ఆమె ఆ విషయం గుర్తించనట్లే ఉంటుంది. ఈలోగా ఆమె కుటుంబం వేరే అవశరాలు నిమిత్తం తమ ఊరికి బయిలుదేరుతుంది. ఈ కుర్రాడు అలా చూస్తూండిపోతాడు. మిగిలిపోతాడు.
ఇలా ఈ మూగ ప్రేమను ఇద్దరు టీనేజ్ పిల్లలతో అందంగా...ప్రతీ ఫ్రేమ్ పెయింటింగ్ లా తీర్చిదిద్దాడు. ఇక అందులో క్లైమాక్స్ చూసిన వారికి చాలా కాలం ఆ సీను వెంటాడుతుంది. మరి అంత అందంగా సముద్ర తీస్తాడా అన్నది ఒక ప్రశ్న అయితే భూమిక మగాడిగా ఎలా సరిపోతుంది...ఆ ఫీల్ అంతలా పండుతుందా...లేకపోతే సత్యభామలా కుప్పకూలుతుందా అనేది అందరి ఆలోచన. ఎందుకంటే అంత అధ్భుతమైన సినిమాని పాడుచేస్తే భాధే కదా అని సినిమా అభిమానులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











