Bimbisara 2: బింబిసార 2 నుంచి ఆ డైరెక్టర్ ఔట్.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!
నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మందే హీరోలుగా పరిశ్రమలోకి అడుగు పెట్టినా.. అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అందులో హరికృష్ణ కుమారుడు కల్యాణ్ రామ్ ఒకడు. హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయినా అతడు పెద్దగా హిట్లను మాత్రం అందుకోలేదు. కానీ, ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానాన్ని అందుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రయోగాలు చేస్తోన్న కల్యాణ్ రామ్.. ఇందులో భాగంగానే గత ఏడాది 'బింబిసార' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన సోషియో ఫాంటసీ చిత్రమే 'బింబిసార'. టైం ట్రావెల్ కాన్సెప్టుతో మల్లిడి వశిష్ట తెరకెక్కించిన ఈ మూవీ ఎన్నో అంచనాలతో విడుదలైంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో ఈ మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా కలెక్షన్లు అత్యధికంగా వచ్చాయి. మొత్తంగా ఈ చిత్రం రూ. 40 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. దీంతో రూ. 22 కోట్లకు పైగా లాభాలు కూడా దక్కించుకుని అతడి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

'బింబిసార' మూవీ రిలీజ్ సమయంలోనే దీనికి సీక్వెల్ కానీ, ప్రీక్వెల్ కానీ తెరకెక్కిస్తామని దర్శకుడు వశిష్ట వెల్లడించాడు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఆ దిశగా పనులు జరుగుతున్నాయట. అయితే, దీని నుంచి వశిష్ట తప్పుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. 'బింబిసార 2' మూవీని అతడు డైరెక్ట్ చేయడం లేదట. కానీ, దీనికి స్క్రిప్టును మాత్రం ఇస్తున్నాడని తెలిసింది. ఈ దర్శకుడు వేరే హీరోతో సినిమాకు కమిట్ అవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఓ టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట తెరకెక్కించిన సినిమానే 'బింబిసార'. ఈ సోషియో ఫాంటసీ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో కేథరిన్ థ్రెస్సా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేశారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











